Ankitha Lokhande: సౌత్ ఇండస్ట్రీపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినీ పరిశ్రమపై విషం చిమ్మడం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అక్కడేదో కాస్టింగ్ కౌచ్ అనే పదమే తెలియనట్టు అక్కడి వారందరూ ఇక్కడ సౌత్ ఇండస్ట్రీ పై విమర్శలు చేస్తుంటే అభిమానుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ మేకర్స్ మీద పడి ఏడుస్తూ క్యాస్టింగ్ ఆరోపణలు చేయడమే కాదు సౌత్ సినీ పరిశ్రమ ఎదుగుదలను తట్టుకోలేక ఇలా కక్ష తీర్చుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. వాస్తవానికి సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమ చిన్నచూపు చూసిన విషయం తెలిసిందే.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ అంటే అసలు లెక్కలోకి తీసుకోలేదు.. ఇక సౌత్ సినిమా అంటే తమిళ సినిమా పోస్టర్లు.. మద్రాసు సినిమా అని మాత్రమే పెట్టేవారు.. అయితే ఇప్పుడు బాలీవుడ్ ని పక్కన పెట్టి టాలీవుడ్ రాజ్యమేలుతోంది.. ముఖ్యంగా మన సినిమా మేకర్స్ హాలీవుడ్ స్థాయికి మన సినిమాని తీసుకెళ్లారు..ఇప్పట్లో ఏ ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ ని అందుకునే రేంజ్ లో లేదు అనడంలో సందేహం లేదు..

అందుకే గతంలో దూరం పెట్టిన బాలీవుడ్ వాళ్లు ఇప్పుడు టాలీవుడ్ ని పట్టుకొని వేలాడుతున్నారు. మన సినిమాని కూడా కలుపుకొని ఇండియన్ సినిమా అనే ట్యాగ్ తగిలించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే తెలుగు పరిశ్రమ ఉన్నత స్థానానికి చేరుకోవడం బాలీవుడ్ సెలబ్రిటీలకు మింగుడు పడడం లేదు.. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు.. సౌత్ ఇండస్ట్రీపై , టాలీవుడ్ ఇండస్ట్రీ పై రకరకాల విమర్శలు చేస్తూ పరిశ్రమ గొప్పతనాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ..
వాస్తవానికి బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తాయి.. ముఖ్యంగా నెపోటిజం కూడా అక్కడ ఎక్కువే.. అందుకే సుశాంత్ సింగ్ లాంటి వారు ఎలా ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా దేనికోసం పోరాటం చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు.. అయితే ఇలాంటి సమయంలోనే బాలీవుడ్ బ్యూటీ అంకిత లోఖండే దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు చేయడం పలు సంచలనాలకు దారి తీస్తోంది.

- Advertisement -

సౌత్ ఇండస్ట్రీ పై విషం కక్కుతున్న అంకిత లోఖండే..
బాలీవుడ్ బ్యూటీ అంకిత లోఖండే.. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది.. ఆమె మాట్లాడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో నేను ఒక ఆడిషన్ కి వెళ్ళాను.. తర్వాత నాకు ఫోన్ చేసి సెలెక్ట్ అయ్యారు.. అగ్రిమెంట్ మీద వచ్చి సంతకం చేసి వెళ్ళండి అన్నారు.. దానితో ఎగిరిగంతేశాను.. ఈ విషయం అమ్మకు చెప్పడంతో ఆమె కూడా సంతోషపడింది. అయితే ఇంత సులభంగా ఎలా సెలెక్ట్ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది.. అయితే నేను సంతకం చేయడానికి వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమన్నారు..

అప్పుడు అర్థం కాలేదు లోపలికి వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ కావాలని అడిగారు… దాంతో షాక్ అయ్యాను అప్పుడు నాకు 19 ఏళ్ళు మాత్రమే.. హీరోయిన్ చేస్తారని అనుకుంటే కాంప్రమైజ్ అడుగుతున్నారు ఏంటి? అని అడిగాను.. అయితే అక్కడ ఒక మేనేజర్ చాలా నీచంగా.. ఆ సినిమా నిర్మాత తో ఒక రాత్రి గడిపితే అవకాశం ఇస్తామని చెప్పారు.. దాంతో నేను క్లాస్ తీసుకున్నాను. వాస్తవానికి ఆ నిర్మాతకి టాలెంట్ అవసరం లేదనుకుంటాను.. అమ్మాయి తన పక్కన పడుకుంటే చాలేమో.. ఇక నాకు అలాంటివన్నీ నచ్చవని చెప్పి వచ్చేసాను అంటూ అంకిత తన అనుభవాన్ని పంచుకుంది.. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు