Regina Cassandra : పెళ్లి చేసుకోబోతున్న రెజీనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొంతమందికి మాత్రమే మంచి పాపులారిటీ వస్తోంది. అలాంటి వారిలో రెజీనా ఒకరు. హీరోయిన్ రెజీనా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ రెజీనా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఏ హీరోయిన్ కు లేని క్రేజ్ ఈ బ్యూటీ కి ఉంది. హాట్ గా ఉండటమే కాకుండా తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది.

రెజీనా కెరీర్

చెన్నైలో పుట్టి పెరిగిన హీరోయిన్ రెజీనా…. మొట్టమొదటగా మోడల్ రంగంలోకి వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా రెజీనాకు తెలుగులో మంచి పాపులారిటీ దక్కింది. 2012 సంవత్సరంలో శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఇక ఈ సినిమాతోనే కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ… ఆ తర్వాత కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రొటీన్ లవ్ స్టోరీ లాంటి బ్రహ్మాండమైన సినిమాలు చేసి విజయాలను అందుకుంది. వరుస సినిమాలు చేయడమే కాకుండా… టాప్ మోస్ట్ హీరోల సరసన చేసింది ఈ బ్యూటీ.

- Advertisement -

హీరోయిన్ రెజీనా ఎఫైర్లు ?

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ రెజీనా… అదే స్థాయిలో తనపై వచ్చిన, ఇంకా వస్తున్న రూమర్స్ ను కూడా భరించుకుంటూ ముందుకు సాగుతోంది. గతంలో సందీప్ కిషన్ తో రెజినా రిలేషన్షిప్ లో ఉందని ప్రచారం చేశారు. ఆ తర్వాత సాయిధరమ్ తేజను పెళ్లి చేసుకోబోతుందని హీరోయిన్ రెజీనాను టార్గెట్ చేశారు కొంతమంది. అక్కడితో ఆగకుండా తమిళ్ స్టార్ హీరో కూడా రెజీనాను వాడుకున్నారని కొంతమంది ప్రచారం చేశారు.

అయితే అవన్నీ ప్రచారాలేనని ఆ తర్వాత తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం… హీరోయిన్ రెజీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. ఓ బిజినెస్ మాన్ ను రెజీనా పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయట. ఈ వివాహానికి రెజీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దసరా లోపు రెజీనా పెళ్లి జరిగే ఛాన్స్ ఉందట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు