Kalki: కల్కి 2898AD మూవీ ట్రైలర్ వచ్చేది అప్పుడే..?

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది మే 9వ తేదీన చాలా గ్రాండ్ గా పలు భాషలలో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని నిర్మాతగా అశ్వని దత్ దాదాపుగా 400 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఇప్పటికే కల్కి సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయంటూ పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్స్ కూడా భావిస్తున్నారు.

కల్కి లో నటిస్తున్న స్టార్స్..
ముఖ్యంగా ఇందులో కమలహాసన్ విలన్ గా నటిస్తూ ఉండడమే కాకుండా అమితాబ్ బచ్చన్, దిశాపటాని, దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ స్టార్స్ తోపాటు రాజేంద్రప్రసాద్, రానా వంటి పలువురు టాలీవుడ్ స్టార్స్ సైతం నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి.. ముఖ్యంగా కల్కి సినిమా మహాభారతంలో మొదలై..2898 వ సంవత్సరంలో ముగుస్తుందని..6000 సంవత్సరాల మధ్య కాలంలో జరిగే కథ అని డైరెక్టర్ ఇటీవలే తెలియజేయడం జరిగింది.

కల్కి ట్రైలర్..
ఇప్పుడు తాజాగా చిత్ర బృందం కల్కి సినిమా ట్రైలర్ పై అప్డేట్ ఇవ్వడం జరిగింది. కల్కి మూవీ ట్రైలర్ ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. దీంతో అభిమానులు సైతం ఈ ట్రైలర్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. మే 9వ తేదీన వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ విడుదల కాబోతోంది. గతంలో విడుదల తేదీ పైన ఎన్నో రకాల రూమర్స్ అయితే వినిపించాయి కానీ వాటన్నింటిని చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ వస్తోంది..

- Advertisement -

కల్కి లో ప్రభాస్ లుక్..
కల్కి మూవీలో ప్రభాస్ ఎన్నడూ లేని విధంగా సరికొత్త లుక్ లో మరొకసారి కనిపించనున్నారు.. కల్కి మూవీ ఎన్ని భాగాలుగా ఉంటుందని విషయాన్ని మాత్రం చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..

ప్రభాస్ తదుపరి చిత్రాలు..
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. సలార్-2 సినిమా తో పాటు.. డైరెక్టర్ మారుతి తో రాజా సాబ్ , డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాని చేయబోతున్నారు.. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలను కూడ ప్రభాస్ చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా కల్కి 2898 AD చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక సరికొత్త చరిత్రను తిరగరాయడానికి సిద్ధమయ్యారని చెప్పవచ్చు.. మరి ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో తెలియాలి అంటే ఏప్రిల్ 9 వరకు ఆగాల్సిందే.. ఇక ప్రభాస్ ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలను పెంచుకున్నారు.. మరి కల్కి చిత్రం ఆయన కెరియర్ కు ప్లస్ అవుతుందా లేక విమర్శల పాలవుతారా అన్నది తెలియాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు