Nassar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దొరికిన విలక్షణ నటుడు

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో నాజర్ ఒకరు. కేవలం ఒక రకమైన పాత్రలనే కాకుండా అన్ని రకమైన పాత్రలలో నూ అద్భుతంగా ఇమిడిపోయి నటుడు నాజర్. నాజర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా నాజర్ కి మంచి గుర్తింపును సినిమా అంటే మాతృదేవోభవ అని చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తాయి.అలానే అద్భుతమైన సందేశాన్ని కూడా ఈ సినిమాతో ఇచ్చారు అని చెప్పొచ్చు.

నాజర్ కి మంచి పేరు తెచ్చిన సినిమాలంటే మాతృదేవోభవ, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి, శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలని చెప్పొచ్చు. అతడు సినిమాలో క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకి తాతయ్యగా కనిపిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు నాజర్.

కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా నాజర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇంకా తెలుగులో నాజర్ కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలంటే అతడు, బిజినెస్ మేన్, బాద్షా, బాహుబలి, పోకిరి, సింహాద్రి, చంటి ఈ సినిమాలన్నిటిని కూడా చెప్పొచ్చు.

- Advertisement -

చంటి సినిమాలో ప్రతి నాయకుడు పాత్రలో కనిపించి అద్భుతమైన పర్ఫామెన్స్ ను అందించారు. ఈ సినిమాకి సంబంధించి ఆయనకు నంది పురస్కారం కూడా లభించింది. అలానే మాతృదేవోభవ సినిమాకు కూడా ఆయన నంది అవార్డును అందుకున్నాడు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడున్న జనరేషన్స్ కి నాజర్ అంటే టక్కును గుర్తొచ్చే రోల్స్ చాలా ఉన్నాయి.

పోకిరి సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా నటించి క్లైమాక్స్ లో నాజర్ ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఏ పాత్రనైనా వేరే స్థాయికి తీసుకెళ్లడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య.
ఇకపోతే బిజినెస్ మేన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన తీరు వేరే లెవెల్ అని మనకి తెలిసిందే. మహేష్ బాబుకి ఆయనకి ఉన్న కాన్వర్జేషన్ అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాలో. ఇకపోతే బాద్షా సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లోనే పండించిన కామెడీ గురించి ఎంత చెప్పనా తక్కువే అవుతుంది.

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో బిజ్జల దేవా క్యారెక్టర్ లో నాజర్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో నాజర్ గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం నాజర్ భీమా అనే సినిమాను చేస్తున్నారు. నాజర్ కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు ఉన్నాయి. ఇలానే మరెన్నో సినిమాలు చేసుకుంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకెన్నో అవార్డులు సాధించాలని కోరుకుంటూ Filmify.in తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు