HBD Sharwanand : ది వరల్డ్ అఫ్ “మనమే”..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్ళలో అన్ని రకాల పాత్రలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పించిన శర్వా, గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో హీరోగా ప్రత్యేక ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రన్ రాజా రన్, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో కోవిడ్ తర్వాత స్పీడ్ తగ్గించాడు. చివరగా రెండేళ్ల కింద ఒకే ఒక జీవితం అనే హిట్టు సినిమాతో పలకరించిన శర్వా ఆ తర్వాత పెళ్ళిచేసుకుని ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అయితే తాజాగా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి మళ్ళీ బిజీ అయ్యాడు. ఇక ఈరోజు (మార్చి6) శర్వానంద్ బర్త్ డే సందర్బంగా శర్వానంద్ శ్రీ రామ్ ఆదిత్య కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ ని టైటిల్ ని రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్.

ది వరల్డ్ అఫ్ ‘మనమే’ లో భాగమైన టెక్నిషియన్స్..

శర్వానంద్ హీరోగా నటిస్తున్న 35 వ చిత్రంగా, శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో బ్యానర్ లో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. శర్వానంద్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ద్వారా ఈ సినిమాకు “మనమే” అనే టైటిల్ ని మూవీ నేమ్ గా డిసైడ్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హేశం అబ్దుల్లా వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

- Advertisement -

 

క్లాసిక్ టచ్ తో..

కాసేపటికిందే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వీడియో లో ఇంగ్లాండ్ ని అనిమేషన్ లో చూపిస్తూ మూవీ టెక్నిషియన్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియో చివర్లో శర్వా ని అలాగే పక్కనే ఒక బాబుని బ్యాక్ నుండి చూపించడం జరిగింది. దీన్ని బట్టి ఈ సినిమాలో శర్వానంద్ ఒక తండ్రి పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. బహుశా హాయ్ నాన్న లాంటి కథా నేపథ్యం ఉండొచ్చు. ఓవరాల్ గా శర్వా స్టయిల్లో ఈ సినిమా ఒక క్లాస్ సినిమాగా తెరకెక్కుతోందని తెలుస్తూనే ఉంది. ఇక చివర్లో శర్వానంద్, కృతి శెట్టి ని ఇంట్లో ఉన్నట్టు చూపించడం జరిగింది. అయితే సినిమా ఎప్పుడు రాబోతుందో అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.

ఇక శర్వానంద్ ఈ సినిమానే కాకుండా రామ్ అబ్బరాజు దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈరోజు రిలీజ్ కానుంది. అలాగే లూజర్ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ తో చేస్తున్న సినిమా అప్డేట్ కూడా రానుంది. ఇక శర్వానంద్ పెళ్లి తరవాత కాస్త గ్యాప్ ఇచ్చినా సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది. ఇక శర్వానంద్ కి filmify తరపున బర్త్ డే విషెస్ ని తెలియచేస్తూ మంచి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ శర్వా తదుపరి సినిమాలపై ఎక్స్ క్లూజివ్ గా అప్డేట్స్ రాబోతున్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు