Anchor jhansi: రోడ్డుపై చెత్త ఏరుకుంటున్న యాంకర్ ఝాన్సీ.. కారణం..!!

ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకర్ అంటే ఝాన్సీనే అందరికీ గుర్తుకు వచ్చేది.. సుమతో పాటుగా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఝాన్సీ.. ఈమె యాంకర్ గానే కాకుండా ఎన్నో చిత్రాలలో కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. గత ఏడాది కూడా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. దసరా, సలార్ తదితర చిత్రాలలో నటించింది.. అయితే మళ్లీ యాంకర్ గా తన అడుగులు మాత్రం వేయలేదు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించి పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది ఝాన్సీ..

చెత్త ఏరుకుంటున్న ఝాన్సీ..
ఈ వీడియోలో ఝాన్సీ రోడ్డుపైన చెత్త సేకరిస్తున్నట్టు కనిపిస్తోంది.. ముఖ్యంగా రోడ్డు పక్కన పడేసిన చెత్తని చాలా జాగ్రత్తగా సేకరించి మరీ తన కారులో తీసుకొని వెళ్తోంది.. అలా ఆమె ఎందుకు చేశారనే విషయం పైన అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.. ముఖ్యంగా ఝాన్సీ ఎండిన ఆకులను, ఎండి గడ్డిని కాల్చి బూడిద చేయకండి అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి అనే విధంగా ఈ వీడియోలో తెలియజేస్తోంది.

ప్రకృతి పర్యరక్షణే ధ్యేయం..
ఇలాంటివన్నీ కూడా మన ప్రకృతికి సమతౌల్య సూత్రం అంటూ కూడా ఈ వీడియో ద్వారా వెల్లడించింది.. ఈ వీడియో మాత్రమే కాకుండా గతంలో ఝాన్సీ ఆవు పేడను ప్రకృతి పద్ధతిలో ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలను కూడా తెలియజేస్తూ పలు రకాల వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉండేది.. అయితే ఝాన్సీ చేస్తున్న ఈ ప్రయత్నానికి పలువురు నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు.. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సాదాసీదాగా కనిపిస్తూ ప్రజలకు తెలియని కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు ఝాన్సీపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు..

- Advertisement -

ఝాన్సీ వ్యక్తిగత జీవితం..
యాంకర్ ఝాన్సీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కాస్త ఇబ్బందిగానే సాగుతోందట.. ఝాన్సీకి ఒక బిడ్డ పుట్టిన తర్వాత తన భర్త జోగి నాయడు కి విడాకులు ఇచ్చేసిందని.. వీరిద్దరూ పెళ్లికి ముందే మంచి స్నేహితులు అయినప్పటికీ ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. పెళ్లి కాకముందే ఇద్దరు కలిసి 9 సంవత్సరాలు కలిసే ఉన్నారు..అయితే పెళ్లయిన ఒక ఏడాదికే వీరిద్దరూ విడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇలా ఎన్నో ఝాన్సీ జీవితంలో కష్టాలను ఎదుర్కొని మళ్ళీ పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది. ఇకపోతే ఇప్పుడు బుల్లితెర షోలలో కనిపించాలని ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే .అందుకు తగ్గట్టుగానే షోల నిర్వహకులు కూడా ఈమెకు అవకాశాలు ఇస్తున్నారు.. మరి తన వాక్చాతుర్యానికి మళ్ళీ పదును పెడుతుందా లేదా అన్నది చూడాలి.. ఏది ఏమైనా యాంకర్ ఝాన్సీ లాంటి గొప్ప టాలెంట్ ఉన్న యాంకర్లు ఇండస్ట్రీలో కొనసాగాలి అని పలువురు సెలబ్రిటీలు కూడా ఆకాంక్షిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు