Ram Charan : అనంత్ అంబానీ పెళ్ళిలో చెర్రీ డ్యాన్స్… ఎంతిచ్చారో తెలుసా?

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. మార్చ్ 1 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన ఈవెంట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ స్టార్స్, భారతీయ సినీ ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరైన రామ్ చరణ్ ఉపాసన దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

“నాటు నాటు” పాటకు స్టెప్పులు
అంబానీ వారసుడి ముందస్తు పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా ఖాన్ల త్రయం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు “ఆర్ ఆర్ ఆర్” మూవీలోని “నాటు నాటు” పాటకు స్టెప్పులేసి ఇరగదీసారు. ఈ వేడుకలో వాళ్లతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ పాటకు కాలు కదిపారు. అయితే ఈ మాత్రం హడావిడి చేయడానికి స్టార్లకు అంబానీ గట్టిగానే ముట్ట చెప్పారు అనేది తాజాగా నడుస్తున్న టాక్. మరి ఇంతకు చెర్రీ ఈ వేడుకకు హాజరు కావడానికి ఎంత తీసుకున్నారు? అంటే…

అంబానీ వేడుకకు చెర్రీ ఎంత ఛార్జ్ చేశాడంటే? ఘనంగా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న స్టార్ హీరోలు అందరికీ అంబానీ గట్టిగానే చెల్లించాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు చిన్న ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా ఎంతో కొంత తీసుకుంటారు. అదే స్పెషల్ ఈవెంట్స్ లో పర్ఫామెన్స్ అయితే కచ్చితంగా భారీగానే ఛార్జ్ చేస్తారు. మరి అంబానీ వంటి కుబేరుడు ఇంటి వేడుకల్లో పాల్గొనడం అంటే ఆర్భాటాలు ఉండాల్సిందే. అందుకే అంబానీ భారీగా డబ్బు ముట్ట చెప్పి మరి బాలీవుడ్ సెలబ్రేట్లకు స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తారని టాక్ నడుస్తోంది. అలా హాజరు కావడానికి సెలబ్రిటీలు కోట్లాది రూపాయలు తీసుకుంటారట.

- Advertisement -

అలాగే ఖాన్ ల త్రయం కూడా భారీ మొత్తంలో అంబానీ వేడుకల్లో సందడి చేయడానికి అందుకున్నారని కంగనా లాంటి సెలబ్రిటీలు ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు పాపులర్ పాప్ సింగర్ రిహాన్నే కు 54 కోట్ల నుంచి 63 కోట్ల వరకు అంబానీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె ముందు బాలీవుడ్ హీరోలను అంబానీ తక్కువ చేసినట్టు అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఖాన్ల త్రయంతో పాటు చెర్రీ కూడా ఈ వేడుకల్లో ఇష్టపూర్వకంగానే పాల్గొన్నారనీ, డబ్బు కోసం ఎవరూ ఇదంతా చేయలేదని మరికొంతమంది కొట్టి పారేస్తున్నారు. అంబానీ ఇంట వేడుకకు ఇన్విటేషన్ రావడమే గొప్పగా భావిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అంబానీల వేడుక హీరోలను వివాదంలోకి లాగినట్టుగా అయ్యింది.

ఇడ్లీ వడ సాంబార్… రామ్ చరణ్
ఇదిలా ఉండగా? స్టేజ్ పై సల్మాన్, అమీర్ లతో స్టెప్పులు వేస్తున్న షారుఖ్ రామ్ చరణ్ ను ఇన్వైట్ చేసే క్రమంలో చేసిన కామెంట్స్ పై మెగా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇడ్లీ వడ సాంబార్… తినేసి కూర్చున్నావా? రామ్ చరణ్ ఎక్కడున్నావ్? అంటూ షారుఖ్ తమిళంలో అడగడంపై చెర్రీ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ జైదీ సోషల్ మీడియా వేదికగా మండిపడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు