Aradhya Bachchan : తల్లిని మించిన అందం… సర్జరీనే కారణమా?

సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ల పిల్లల సంగతి ఏంటి? అనే విషయాలను తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటారు. ముఖ్యంగా స్టార్స్ వారసుల విషయంలో ఉండే ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. అయితే తాజాగా ఐశ్వర్యా రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఆమె అందానికి సీక్రెట్ సర్జరీ అనే చర్చ నడుస్తోంది. అసలు ఆ కామెంట్స్ కు కారణం ఏంటి? అంటే…

అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్…

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు మూడు రోజుల క్రితం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మార్చ్ ఒకటి నుంచి మొదలైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులపాటు ఘనంగా జరిగాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కు వేదిక కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. అలాగే బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్లతో పాటు అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ కూడా హాజరైంది. ఈ వేడుకలో ఐశ్వర్య రాయ్ తో పాటు ఆమె కూతురు ఆరాధ్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా ఆరాధ్య లుక్ అందరినీ ఆకర్షించింది.

- Advertisement -

సర్జరీనే ఆమె అందానికి కారణమా?

అంబానీ ఇంట్లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతులు తమ కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి హాజరయ్యారు. అయితే ఆరాధ్య లుక్ చూస్తే తల్లిని మించిన అందం అనిపించేలా ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి. పార్టీలో మెరిసిన ఆరాధ్య ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. అందులో ఆరాధ్య మాత్రం ఇప్పటిదాకా కనిపించింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది. గతంలో ప్రతిసారి ఒకే హెయిర్ స్టైల్ లో మైంటైన్ చేసిన ఆరాధ్య అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్ లో మాత్రం కొత్తగా కనిపించింది. ఆమె ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.. హఠాత్తుగా ఆమె ఇలా ఇంత అందంగా కనిపించడంతో ఆరాధ్య బచ్చన్ సర్జరీ చేయించుకుందని, అందుకే ఇంత అందంగా కనిపిస్తోందని టాక్ మొదలైంది.

సర్జరీ కోసమే విదేశాలకు?

నిజానికి కొన్ని నెలల క్రితం ఆరాధ్య ఇలా లేదు. ఇప్పుడు మాత్రం సడన్ గా చూపు తిప్పుకోలేని అందంతో అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం ఆరాధ్య వయసు 12 ఏళ్ల 3 నెలలు. అయితే ఇంత చిన్న ఏజ్ లో ఉన్న ఆరాధ్య అందం వెనుక ఉన్న సీక్రెట్ ఆమె హెయిర్ స్టైల్, మేకప్ అని అభిమానులు అంటున్నారు. కానీ ఆరాధ్య సర్జరీనే అందుకు కారణం అని మరో వాదన వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆరాధ్య బచ్చన్ తన తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు వెళ్ళింది. అప్పుడే సర్జరీ చేయించుకుని ఉంటుందనే గుసగుసలు మొదలయ్యాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే బచ్చన్ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చేదాకా ఆగాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు