Oppenheimer: ఊహించిందే జరిగింది

క్రిస్టోఫర్ నొలన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు హాలీవుడ్ లో సినిమాలు తీసిన కూడా నొలన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అంతటి అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. నొలన్ సినిమా అంటే ఎప్పటికీ ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే నొలన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిలిం ఓపెన్ హైమర్.

జూలియస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్ అమెరికా భౌతిక శాస్త్రవేత్త. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడు. యుద్ధ సమయంలో లాస్ అలమోస్ పరిశోధనాశాలకు అధ్యక్షుడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకిలో పేల్చిన అణుబాంబులను తయారు చేసే మన్‌హట్టన్ ప్రాజక్టులో అతని విశేష సేవలకు గుర్తుగా ఈయనను అణుబాంబు పితామహుడుగా పిలుస్తారు. మెుదటి అణుబాంబు పరీక్షను 1945 జూలై 16, మెక్సికోలోని ట్రినిటి టెస్టలో భాగంగా నిర్వహించారు. రాబర్ట్ ఓపెన్ హైమర్ తాను భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేసాను అని చెబుతుంటాడు.

ఇదే పేరుతో సినిమాను తెరకెక్కించాడు నొలన్. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ అంజిల్స్ లో డాల్బీ థియేటర్లో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. 96వ అకాడమిక్ అవార్డుల ఫంక్షన్ కి దేశ దేశాల నుంచి సినీ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డులను ఇవ్వడం ఇవ్వడం జరిగింది. అయితే అందరూ ఊహించినట్టుగానే ఓపెన్ హైమర్ సినిమాకి అవార్డులు లభించాయి.

- Advertisement -

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌: హెయటే వన్‌ హోయటేమా (ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్‌ సినిమాటోగ్రఫిOppenheimer: ఊహించిందే జరిగింది: ఓపెన్‌ హైమర్
ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌)
బెస్ట్‌ డైరెక్టర్‌: క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌)
ఉత్తమ చిత్రం: ఓపెన్‌ హైమర్‌

ఏదేమైనా కొన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అలా అరుదుగా జరిగే సినిమాల్లో నొలన్ సినిమాలు ఎప్పుడు ముందు ఉంటాయని చెప్పొచ్చు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు