Oscar 2024 : ఆస్కార్ విన్నర్స్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

సినిమా రంగంలో నటినటులను ప్రోత్సహించడానికి, వాళ్ళ టాలెంట్ ను గుర్తించడానికి పలు రకాల అవార్డుల వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి స్టార్ కలలుగానే అవార్డు మాత్రం ఆస్కార్ అవార్డే. మరి ఇంతకీ ఈ ఆస్కార్ అవార్డు అందుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? దాని విలువ ఎంత ఉంటుంది? ఆస్కార్ అవార్డును గ్రహీతలు అమ్ముకోవచ్చా? అమ్ముకుంటే ఎంత నగదు చేతికి అందుతుంది? ఇంతకీ ఆస్కార్ విన్నర్స్ కు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు మీ మదిలో కూడా మెదులుతున్నాయా? సమాధానాలు తెలుసుకోవాలంటే ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే.

ఆస్కార్ విన్నర్స్ ప్రైస్ మనీ ఇదే…
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం తాజాగా అమెరికాలో ఘనంగా జరిగింది. 96వ అకాడమీ అవార్డ్స్ లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా జరగ్గా, పలువురు హాలీవుడ్ అగ్రతారలు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. అయితే ఈసారి “ఓపెన్ హైమర్” మూవీకి అవార్డుల పంట పండింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా వంటి కేటగిరీల్లో మొత్తం 7 అవార్డులను సొంతం చేసుకుంది ఓపెన్ హైమర్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులు ఆస్కార్ కి నామినేట్ అయితే చాలని కలలు కంటూ ఉంటారు. అలాంటిది ఆ అవార్డును అందుకున్న విన్నర్స్ కు అంతటి మహాద్భుతమైన క్షణం వాళ్ళ జీవితంలో మరొకటి ఉండదేమో. అయితే ఆస్కార్ విన్నర్స్ కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత? అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఏదైనా అవార్డు వస్తే నగదు కూడా బహుకరిస్తారు. అయితే అస్కార్స్ విన్నర్స్ విషయంలో మాత్రం ఇది డిఫరెంట్ గా ఉంది. ప్రైజ్ మనీ విషయంలో ఎవ్వరూ ఊహించనీ సమాధానమే లభిస్తుంది. కేవలం బంగారు పూత పూసిన ట్రోఫీని తప్ప విన్నర్స్ కు డబ్బులు ఏమీ ఇవ్వరట.

ట్రోఫీతో లాభమేంటి?…
మరి డబ్బులు ఇవ్వనప్పుడు ఆస్కార్ ట్రోఫీ అందుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఈ ట్రోఫీ వల్ల మనీ పరంగా పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ పాపులారిటీ మాత్రం ప్రపంచం నలుమూలలకు పాకుతుంది. నటీనటులకు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది ? ఆస్కార్ విన్నర్స్ కు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగిపోతుంది. అవార్డును అందుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల పేరు ప్రఖ్యాతులు, రెమ్యూనరేషన్ ఊహించని రేంజ్ లో పెరిగిపోతాయి.

- Advertisement -

ట్రోఫీ విలువ ఎంత?
మరి ట్రోఫీ విలువ ఎంత అంటే… ఆస్కార్ ట్రోఫీని కాంస్యంతో చేసి, పైన 24 క్యారెట్ల బంగారం పూత పూసి తయారు చేస్తారు. దీని తయారీకి 100 డాలర్లు, ఇండియన్ కరెన్సీలో 82,000 ఖర్చు అవుతుంది. అయితే ఆస్కార్ విజేతలకు తమ ట్రోఫీని అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది. కానీ బయట వాళ్లకు కాకుండా అకాడమీకి మాత్రమే అమ్మాలి. ఫలితంగా ఒక డాలర్ అంటే 82 రూపాయలు తిరిగి ఇస్తారన్నమాట. ఆస్కార్ అవార్డ్స్ ను సెలబ్రిటీలు బయట ఎక్కడా అమ్ముకోకుండా ఉండడానికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ అండ్ సైన్స్ ఇలాంటి రూల్ పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు