Sukruthi : ఫ్రెండ్ కోసం తొమ్మిదేళ్ల తర్వాత కనిపించిన నటి..

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తారు. కానీ అందులో కొంతమందే సక్సెస్ అవుతారు. అయితే అందులోనూ టాలెంట్ ఉన్న హీరోయిన్లు తక్కువ. కానీ మంచి ఫాలోయింగ్ ఉన్నా కూడా కెరీర్ బిగినింగ్ లోనే పెళ్ళిచేసుకుని సినిమాలకి దూరమైన హీరోయిన్లు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చేసినవి తక్కువ సినిమాలైనా ఆ సినిమాలతో ప్రేక్షకుల మనసులో అలాగే ఏళ్ళ పాటు నిలిచిపోతారు. ముఖ్యంగా హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే అట్రాక్ట్ చేసి అప్పటికప్పుడు కనుమరుగయ్యారు. అలాంటి హీరోయిన్లలో సుకృతి ఒకరు. ఈ పేరు వినడానికే కొత్తగా ఉంది కదూ.. ఇలా అయితే తెలీదు గాని నూకరాజు భావన అంటే మూవీ లవర్స్ తెలియని వారు ఉండరు. దిల్ రాజు నిర్మాణంలో 2015లో ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘కేరంత’. ఆ సినిమాలోనే ఒక హీరోయిన్ గా నటించింది ‘సుకృతి అంబటి’.

కేరింత సినిమా లో హీరోయిన్ గా..

సుమంత్ అశ్విన్, పార్వతీశం, విశ్వంత్, శ్రీదివ్య, సుకృతి, తేజస్వి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కేరింత సినిమా యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నూకరాజు పాత్ర ప్రతిఒక్కరిని బాగా ఎంటర్టైన్ చేసింది. నూకరాజు పాత్రని పార్వతీశం పోషించగా, తనకి జోడిగా భావన పాత్రలో సుకృతి నటించింది. ఇక ఈ మూవీలో వీరిద్దరి ట్రాక్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నూకరాజు లవ్ కోసం హెల్ప్ చేస్తూ, చివరికి తనే లవ్ చేసేస్తోంది. అయితే
ఈ చిత్రం తరువాత మరో సినిమాలో నటించని సుకృతి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది.

- Advertisement -

సుకృతి అంబటి ఫ్యామిలీ లైఫ్..

కేరింత సినిమాతో అందరి మనసుల్ని దోచేసిన సుకృతి ఆ ఒక్క సినిమాకే ఆపేసి పెళ్లి చేసేసుకుని ఫ్యామిలి జీవితాన్ని స్టార్ట్ చేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తుంది. అయితే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సుకృతి. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఆడియన్స్ కి కనిపించడం జరిగింది. తనతో పాటు కేరింత సినిమాలో నటించిన, తన స్నేహితుడు పార్వతీశం కొత్త సినిమా ప్రమోషన్ కోసం సుకృతి నెట్టింట వైరల్ అయింది. పార్వతీశం హీరోగా, ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కెట్ మహాలక్ష్మి’. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం పార్వతీశం తన స్నేహితురాలు సుకృతిని రంగంలోకి దించాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో లో మళ్ళీ భావన అంటూ నూకరాజు పాత్రని గుర్తు చేశారు. ఆ ప్రమోషన్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Actress Sukruthi is back for friend Parvatheesham

నూకరాజు లవ్ కోసం ఇప్పుడు కూడా హెల్ప్..

కేరింత సినిమాలో నూకరాజు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానంటూ భావన ని లవ్ లెటర్ రాయమని హెల్ప్ అడుగుతాడు. అప్పుడు ఫ్రెండ్ కోసం సాయం చేసిన భావన తానే నూకరాజుని ప్రేమిస్తుంది. ఇక ఇప్పుడు అదే పాయింట్ తో నూకరాజు గా పార్వతీశం భావన అయిన సుకృతి ని ప్రమోషన్ కోసం హెల్ప్ చేయమని ఇండైరెక్ట్ అడిగినట్టు ప్రోమో రెడీ చేశారు. ఇక సుకృతి ప్రస్తుతం అమెరికాలోనే తన భర్త అక్షయ్ సింగ్ తో ఫ్యామిలీ లైఫ్ ని గడిపేస్తుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు