Siva Karthikeyan: నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం వలనే ఆ సినిమా రిలీజ్ కాలేదు

నెల్సన్ దిలీప్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నెల్సన్. అయితే నెల్సన్, చెన్నైలోని న్యూ కాలేజ్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీని సాధించి తర్వాత స్టార్ విజయ్ ఛానల్ లో అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు.

2018 లో రిలీజ్ అయిన కొలమావు కోకిల సినిమాతో దర్శకుడుగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. ఇదే సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. నయనతార నటించిన ఈ సినిమా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కామెడీ ఫిలిం చాలామందికి డిఫరెంట్ గా అనిపించింది. ఈ సినిమా తర్వాత డాక్టర్ అనే సినిమాను చేశాడు నెల్సన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూలు చేసింది.

డాక్టర్ సినిమా తర్వాత విజయ్ హీరోగా బీస్ట్ అనే సినిమాను తెరకెక్కించాడు నెల్సన్. అయితే అంతకుముందు డాక్టర్ సినిమా అద్భుతమైన హిట్ అవడంతో విజయ్ లాంటి స్టార్ హీరోతో ఎటువంటి సినిమాను తీస్తాడు అని చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. అయితే ఎంతో క్యూరియాసిటీతో థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి ఈ సినిమా ద్వారా కొద్దిపాటి నిరాశ అయితే మిగిలిందని చెప్పొచ్చు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

- Advertisement -

ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్ అనే సినిమాను తీశాడు నెల్సన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. జైలర్ సినిమా మళ్ళీ రజినీకాంత్ కెరీర్ కి స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది అని కూడా చెప్పొచ్చు. అక్కడితో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు నెల్సన్. ఇకపోతే వీటన్నిటికంటే ముందు నెల్సన్ జర్నీ అనేది 2010లో డైరెక్టర్ గా స్టార్ట్ అవ్వాల్సి ఉంది.

నెల్సన్ 2010లో తన తొలి దర్శకత్వం వహించాలనుకున్న వేట్టై మన్నన్‌. ఈ చిత్రంలో సిలంబరసన్ , జై , హన్సిక మోత్వాని మరియు దీక్షా సేథ్ నటించారు.NIC ఆర్ట్స్ యొక్క SS చక్రవర్తి నిర్మించారు. మరియు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు . అయితే, సినిమా సగంలోనే అనివార్య కారణాలతో ఆగిపోయింది. యువన్ శంకర్ రాజా స్థానంలో అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొత్త సిబ్బందితో ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది జరగలేదు.

ఇది నెల్సన్ ఆగిపోయిన సినిమా మరొకసారి చర్చలోకి వచ్చింది. దీనికి కారణం శివ కార్తికాయన్. అయితే శివ కార్తికేయన్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మా గురు ఇక్కడే ఉన్నారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఆయనే నెల్సన్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయటం వల్లనే ఆ సినిమా ఆగిపోయింది అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు శివ. ఏదేమైనా నేడు నెల్సన్ ఒక స్టార్ డైరెక్టర్ గా తమిళ్ ఫిలిమ్ నిలదొక్కుకున్నాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు