RC 16: రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ..!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పుడు వేగంగా సాగుతున్నాయి.. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు రామ్ చరణ్.

RC16 లో కృతి సనన్..
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .. ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా మేకర్స్ కూడా వెల్లడించారు.. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరొక వార్త నెట్టింట వైరల్ గా మారింది.. అదేమిటంటే ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు ఇటీవలే ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి సనన్.. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అందులో ఈమె కనిపిస్తారని తెలిసింది.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది..

గేమ్‌ ఛేంజర్‌ మూవీ విశేషాలు..
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.. ఈ నెల ఆఖరి వరకు వైజాగ్ లోనే షూటింగ్ జరగనుంది ..గత మూడు ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అటు రామ్ చరణ్ భావిస్తున్నారు.. అంతే కాదు దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా రాజీపడకుండా ఈ సినిమాను మరింత అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.. రాజకీయ అంశాలతో నిండిన యాక్షన్ కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. ఇక రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ , అంజలి నటించబోతున్నట్లు సమాచారం. ఇక వీరితోపాటు ఎస్ జె సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం..

- Advertisement -

కృతి సనన్ కెరియర్..
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక గాధ రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది.. అయితే సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదని చెప్పాలి.. కానీ కృతి సనన్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.. ఇప్పుడు మరొకసారి తెలుగు హీరోతో జత కట్టనుంది ఈ ముద్దుగుమ్మ.. మరి ఈ సినిమాతో నైనా ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు