Rajamouli : రాజమౌళి స్ట్రాటజీ ఇదే… అదే వేరే డైరెక్టర్స్ ఇలా చేస్తే చంపేసే వాళ్ళు..

దర్శక ధీరుడు రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తన సినిమాల విషయంలో వేసే ప్లాన్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉంటాయి. ఎక్కడా కూడా జనాలకు ఇంకా మూవీ స్టార్ట్ కాలేదేంటి? వంటి విసుగు తెప్పించే ఆలోచనలు రాకుండా చేస్తాడు రాజమౌళి. అదే వేరే డైరెక్టర్స్ ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుంటే దాదాపు చంపేసినంత పని చేస్తారు అభిమానులు. సోషల్ మీడియా వేదికగా వాళ్లను నిలదీస్తారు. మరి ఇంతకీ ఆడియన్స్ లో సినిమాపై ఆకలి పెంచడానికి రాజమౌళి ఉపయోగిస్తున్న ఆ కొత్త స్ట్రాటజీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

ఇదే రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ…
జక్కన్న సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్ టీం అక్కర్లేదు. ఎందుకంటే ఆయనే కొత్త స్ట్రాటజీ వాడి సినిమాపై అంచనాలను పెంచేస్తూ ఉంటారు. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ఊరించడం, ఆ తర్వాత ఏదో ఒక విధంగా మరింత సమయం ప్రేక్షకులను వెయిట్ చేయించడం అనేది రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పటిలాగే మహేష్ బాబుతో తన నెక్స్ట్ మూవీ విషయంలో కూడా ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు జక్కన్న. పలువురు స్టార్ హీరోల పెద్ద ప్రాజెక్టులు తెరపైకి రాబోతున్నప్పటికీ, దేశమంతా తన మూవీ గురించి మాట్లాడుకునేలా చేస్తారు జక్కన్న. ఊరించి ఊరించి చివరకు పంచభక్ష పరమాన్నాలు వడ్డించడం ఆయనకు బాగా అలవాటయింది. ఇప్పుడు SSMB29 మూవీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ మూవీ నుంచి అప్డేట్స్ అంటూ ఎక్కడికి వెళ్లినా ఆయనను ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ రాజమౌళి మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. పలు సినిమాల ఈవెంట్లలో మెరిసినప్పటికీ అప్డేట్ విషయాన్ని దాటవేస్తూ టైం వచ్చినప్పుడు చెప్తాను అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. దీనివల్ల సినిమాపై మరింతగా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. బాగా కడుపు కాలి ఆకలి మీద ఉన్నప్పుడు సద్దన్నం కూడా పంచభక్ష పరమాన్నం లాగే కనిపిస్తుంది. ఇదే సూత్రాన్ని జక్కన్న ఫాలో అవుతున్నారు. ఎంతో కాలం ఎదురు చూసిన తరువాత ఆడియన్స్ కి జక్కన్న స్క్రీన్ పై వడ్డించే స్టోరీ అద్భుతంగా కనిపించాల్సిందే. దీంతో మూవీ ఎలా ఉన్నా సరే బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది.

SSMB 29 ఇప్పట్లో ఉండదా?
2023 డిసెంబర్ నుంచి ఆరు నెలల పాటు వర్క్ షాప్ ఉంటుందని, ఆ తర్వాత సమ్మర్ లో షూటింగ్ మొదలు పెడతామని చెప్పుకొచ్చారు. కానీ చూస్తుంటే దానికి సంబంధించిన హడావిడి ఏమీ కనిపించడం లేదు. ఒకవైపు మహేష్ బాబు వరుసగా యాడ్స్ వంటివి చేస్తుంటే, మరోవైపు రాజమౌళి పలు సినిమాల ఈవెంట్లకు గెస్ట్ గా హాజరవుతున్నారు. కానీ ఎక్కడా SSMB 29 ఊసే లేదు. ముఖ్యంగా మొన్నటిదాకా మహేష్ గడ్డంతో కనిపించడంతో ఇదే రాజమౌళి సినిమా లుక్ అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మహేష్ కొత్త లుక్ లో మెరిశారు. దీంతో టెస్ట్ లుక్ ఇంకా పూర్తి కాలేదనే విషయం స్పష్టమవుతుంది. అంటే SSMB 29 మూవీ పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. కానీ ప్రేక్షకులకు విసుగు రాకుండా, మరింత ఆసక్తి పెరిగేలా ఏదో ఒకరకంగా రాజమౌళి ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటున్నారు.

- Advertisement -

రాజమౌళి రూటే సపరేటు…
బాహుబలి మూవీ విషయంలో కూడా రాజమౌళి ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. సినిమాను స్టార్ట్ చేయడానికి దాదాపు ఏడాది పాటు టైం తీసుకున్నారు. ఇప్పుడేమో మహేష్ మూవీ విషయంలో కూడా రాజమౌళి అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. సాధారణంగా ఇతర దర్శకులు ఈ రేంజ్ లో గ్యాప్ తీసుకుంటే సోషల్ మీడియా వేదికగా వాళ్లను ఉతికి ఆరేసే వాళ్లు. కానీ రాజమౌళి మాత్రం తన రూటే సపరేటు అన్నట్టుగా నెమ్మదిగా, అదే సమయంలో ఆడియన్స్ లో సహనం నశించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు