Rahul Sipligunj : కావాలనే చేశా… మంగ్లీతో గొడవపై రాహుల్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా రాహుల్ సింగర్ మంగ్లీతో జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది? రాహుల్ వివరణ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

రాహుల్ సింగింగ్ ఇలా మొదలైంది…
రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో మ్యూజిక్ లవర్స్ కు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత ప్లే బాక్స్ సింగర్ గా మాస్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి, విన్నర్ గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటను పాడి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ స్టేజ్ పై పర్ఫార్మ్ చేసే లెవెల్ కు ఎదిగాడు. కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటాడు ఈ సింగర్.

గొడవ ఏంటంటే?…
“నాటు నాటు” పాటతో ఆస్కార్ స్టేజ్ పై తెలుగు పాటను ప్రజెంట్ చేసి, తెలుగు వాళ్ళు సగర్వంగా ఫీల్ అయ్యేలా చేసిన రాహుల్ సింప్లిగంజ్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్స్ అనే షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు పాపులర్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ మంగ్లీ కూడా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ షో జరుగుతున్న సమయంలో సింగర్ మంగ్లీ రాహుల్ సింప్లిగంజ్ మధ్య గొడవ జరిగింది. షోలో భాగంగా మంగ్లీ టీంకు రాహుల్ 8 మార్కులే ఇచ్చాడు. దీంతో మంగ్లీ “డిసప్పాయింట్ అయ్యాను” అని కామెంట్ చేసింది. “నువ్వు డిసప్పాయింట్ అయితే అవ్వు… కానీ నేను బొచ్చెడు సార్లు పదికి పది మార్కులు ఇచ్చాను” అనేసాడు రాహుల్. దానితో మంగ్లీ “నువ్వు బొచ్చెడు సార్లు అని మళ్లీ మళ్లీ అనకు… ఈ పర్ఫామెన్స్ కి ఇచ్చావా? దీని గురించి మాట్లాడు” అని సీరియస్ అయింది. రాహుల్ “మంగ్లీ మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే సెన్సిబుల్ గా ఉండాలి… మైక్ దొరికింది కదా అని అరవకు… ఫస్ట్ నేనేం చెప్తున్నానో విను” అని అంటుండగానే మంగ్లీ “ఓ మై గాడ్ ఓ మై గాడ్” అంటూ అడ్డు తగిలింది.

- Advertisement -

మంగ్లీతో గొడవపై రాహుల్ వివరణ…
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రాహుల్ మంగ్లీతో జరిగిన గొడవ గురించి మాట్లాడారు. ఫన్ కోసం కావాలనే మంగ్లీని టీజ్ చేసే వాడినని చెప్పుకొచ్చాడు రాహుల్. అయితే తాను మంగ్లీ మంచి ఫ్రెండ్స్ అని, ఎంటర్టైన్మెంట్, ఫన్ కోసం కో జడ్జ్ ని టీజ్ చేశానని, అప్పుడప్పుడు అది ఎమోషనల్ అవుతుందని అన్నారు. కానీ వాస్తవానికి జడ్జెస్ అందరూ చాలా ఫన్నీగా ఉంటామని, నలుగురు జడ్జ్ లు కూడా వర్క్ ను ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అందరిలో అనంత్ శ్రీరామ్ గారు బాగా ఎంటర్టైన్ చేస్తారని, అందరికీ తెలిసిన విషయమే ఆయన డిఫరెంట్ గా చెప్తారని పేర్కొన్నాడు రాహుల్. అంతేకాకుండా కో జడ్జెస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక పనిలో పనిగా శ్రీముఖి గురించి కూడా ప్రస్తావించాడు. శ్రీముఖి చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని, ఆమె హోస్టింగ్ ను ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు