Taapsee Pannu: చాలా మంది అబ్బాయిలతో ఆ పనులు చేశా !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో తాప్సి పన్ను ఒకరు. హీరోయిన్ తాప్సి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎక్కడా కూడా స్ట్రగుల్ పడకుండా… టాప్ మోస్ట్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు తాప్సి.

టాలీవుడ్ లో తాప్సి సందడి..

ఢిల్లీకి చెందిన హీరోయిన్ తాప్సి పన్ను… మొదట్లో మోడల్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ అయిపోయింది తాప్సి. ముఖ్యంగా తన కెరీర్ ను తెలుగు చిత్ర పరిశ్రమంలోనే ప్రారంభించింది హీరోయిన్ తాప్సి. 2010 సంవత్సరంలో హీరో మంచు మనోజ్ కథానాయకుడిగా ఝుమ్మంది నాదం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా తాప్సీ నటించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకోవడంతో…. హీరోయిన్ తాప్సికి మంచి స్టార్ డం వచ్చింది. ఆ తర్వాత ఆ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి.

- Advertisement -

అటు 2011 సంవత్సరంలో ఏకంగా నాలుగు సినిమాలను చేసేసింది ఈ బ్యూటీ. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ సరసన నటించి మరో బంపర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ తాప్సి. అటు గోపీచంద్ సరసన మొగుడు సినిమాలో నటించి పర్వాలేదనిపించింది. ఇటు మాస్ మహారాజ్ చేసిన దరువు సినిమాలో నటించి మరో బంపర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ తాప్సి.

హిందీలోనూ తోపు హీరోయిన్

తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తాప్సి వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తన కెరీర్ ప్రారంభంలో చస్మే బద్దూర్ అనే సినిమాలో నటించింది. ఇక 2023 సంవత్సరంలో డంకి అన్న సినిమాతో అందరినీ మెప్పించింది తాప్సి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడమే కాకుండా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మెరుస్తూ ఉంటుంది హీరోయిన్ తాప్సి. కంగనాకు వ్యతిరేకంగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది.

అబ్బాయిలతో అలాంటి పనులు

అయితే కెరీర్ మంచి జోష్ లో ఉన్న సమయంలో… పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందట హీరోయిన్ తాప్సి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా తాప్సీ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. తాను ప్రేమిస్తున్న వ్యక్తిపై హీరోయిన్ తాప్సీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ మతియాస్ పరిచయం కాకముందు కొంతమంది అబ్బాయిలతో స్నేహం చేశానని… కానీ ఎవరి వ్యక్తిత్వం తనను ఆకట్టుకోలేదని చెప్పుకొచ్చారు తాప్సి.

అంతేకాకుండా పురుషులలో నిజాయితీతో పాటు జీవితం పట్ల మెచ్యూరిటీ ఉండాలని తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది తాప్సి. అటు ఈ లక్షణాలు మతియాస్ లో చాలా పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు హీరోయిన్ తాప్సి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆ వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ సొట్ట బుగ్గల సుందరి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు