Premalu: తగ్గని డబ్బింగ్ సినిమా హావా..

ప్రస్తుతం తెలుగు ఆడియోన్స్ అంతా బాగా అప్డేట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఒక మంచి సినిమా ఏ లాంగ్వేజ్ లో ఉన్నా కూడా అందరికి చూడటం అలవాటుగా మారింది. కొన్నిసార్లు భాష అర్థం కాకపోయినా కూడా ఎంతో కొంత అర్థం చేసుకొని ఆ సినిమాను చూడటం అనేది తెలుగు ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు. అలానే ఇతర భాషల్లో చాలా సినిమాలు తెలుగు ఆడియోన్స్ ఆదరించడం వల్లే హిట్ అయ్యాయి అని కూడా చెప్పొచ్చు.

ఇకపోతే రీసెంట్ గా మలయాళంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా ప్రేమలు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా ఈ సినిమాను హైదరాబాద్ లోనే చాలామంది ఒరిజినల్ వెర్షన్ ను వీక్షించారు. ఆ తర్వాత ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. ఈ డబ్బింగ్ చేసిన సినిమాకి తెలుగులో కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ కి ఆమె పెర్ఫార్మన్స్ కి చాలా మంది ఆడియన్స్ ఫిదా అయిపోయా.

ఇకపోతే డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు కూడా సరైన ఆదరణను తీసుకురాలేవు. ఎందుకంటే ఒరిజినల్ ఇచ్చే ఫీల్ డబ్బింగ్ సినిమాలు కొంతవరకు కిల్ చేస్తాయని కొందరు భావిస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం డబ్బింగ్ కూడా వర్కౌట్ అవుతాయి. ఇకపోతే అలా వర్క్ అయిన సినిమాలు చూస్తే కాంతారా, లవ్ టుడే వంటి సినిమాలును చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ ప్రేమలు సినిమాని తెలుగులో ప్రేమలు పేరుతోనే డబ్బింగ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఆదిత్య హాసన్ రచయతగా వర్క్ చేశాడు ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలోని డైలాగ్స్ అని చెప్పొచ్చు అంత అద్భుతంగా ఈ సినిమాకి డైలాగ్స్ అందించాడు ఆదిత్య.

ఆదిత్య హాసన్ విషయానికి వస్తే ఈటీవీ విన్ సూపర్ హిట్ సిరీస్ 90s తో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అయితే చాలామందికి 90s సిరీస్ తో దగ్గర అయిపోయాడు ఆదిత్య. ఆదిత్య కి అద్భుతమైన పేరుని తీసుకురావడంతో పాటు మంచి అవకాశాలను కూడా తీసుకొచ్చింది. ఇకపోతే ఆదిత్యకి నితిన్ తో సినిమా వర్కౌట్ అయిన విషయం తెలిసిందే.అయితే ఆదిత్య రాసిన ఈ డైలాగ్స్ కి మంచి రికగ్నైజేషన్ వచ్చింది దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆదిత్యాను అప్రిషియేట్ చేశారు.

మొత్తానికి తెలుగులో కూడా ఈ సినిమా హవాను కొనసాగిస్తుందని చెప్పవచ్చు. మామూలుగా రిలీజ్ డే తర్వాత స్లో స్లోగా థియేటర్ కి ఆడియన్స్ రావడం తగ్గుతూ ఉంటారు. కానీ ఈ సినిమా మౌత్ టాక్ వలన ప్రతిరోజు ఆడియన్స్ ఈ సినిమాకు పెరుగుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నో డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్ చేసినట్టు, రీసెంట్ గా ఈ సినిమాను కూడా హిట్ చేస్తున్నారని చెప్పొచ్చు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు