Heroines : ప్రస్తుతం ఈ ముగ్గురే సెన్సేషన్

ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలోను కొందరికి కొంత టైం నడుస్తుంది అని అంటారు. అయితే ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కూడా కొందరికి అవకాశాలు రావడం అరుదుగా జరుగుతుంది. ఒక డిజాస్టర్ సినిమాతో అవకాశం పొందుకున్న కూడా వాళ్లకు అవకాశాలు మెండుగా వస్తాయి. ఇకపోతే కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన నటీనటుల్ని అందరూ గుర్తుపెట్టుకోవటం అలవాటుగా మారిపోయింది.

రీసెంట్ గా ఇతర భాషల్లో హిట్ అయిన కొన్ని సినిమాల్లో చాలామంది హీరోయిన్స్ బాగా పాపులర్ అయిపోయారు. కేవలం సినిమాల్లోనే కాకుండా కొన్ని రీల్స్ ద్వారా కూడా పాపులర్ అయ్యి చాలామందిని ఫిదా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఒక కన్ను కొట్టడంతో మంచి ట్రెండ్ లోకి వచ్చేసింది ఈ పాప. తర్వాత తెలుగులో నితిన్ సరసన చెక్ అనే సినిమాలో కూడా కనిపించింది. కానీ ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇకపోతే ప్రస్తుతం ముగ్గురు హీరోయిన్స్ మాత్రం సౌత్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నారని చెప్పొచ్చు. ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం.
అయితే వీరిలో ఒక ఇద్దరు హీరోయిన్స్ మాత్రం ఓపెనింగ్స్ లోనే మంచి సూపర్ హిట్ అందుకున్నారని చెప్పొచ్చు. కానీ మరో హీరోయిన్ ఓపెనింగ్ డిజాస్టర్ అయినా కూడా తన కెరియర్లో స్టార్ హీరోస్ తో నటించే అవకాశం పొందుతుంది.

- Advertisement -

మమితా బైజు

Mamitha Baiju
రీసెంట్ గా బాగా పాపులర్ అయిన హీరోయిన్ మమిత బైజు. ఈమె 2017లో సర్వోపరి పాలక్కారన్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆపరేషన్ జావా (2021)లో అల్ఫోన్సా, ఖో ఖో (2021)లో అంజు, సూపర్ శరణ్య (2022)లో సోనా, ప్రణయ విలాసం (2023)లో గోపిక వంటి మంచి పాత్రలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సాధించుకొని తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయిపోయింది మమిత.

రుక్మిణి వసంత్

Rukmini Vasanth
2019లో రిలీజ్ అయిన బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రముని సినిమాలో జాన్వి పాత్రతో కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది రుక్మిణి వసంత్. సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ ఏ సినిమాతో కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీలో మంచి హిట్ అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. ఇదే సినిమా తెలుగులో సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ పేరుతో విడుదలైంది. దర్శకుడు హేమంత్‌ ఎం. రావు తెరకెక్కించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ నటించింది.

శ్రీలీల

Sreeleela
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ పరిచయం అయింది శ్రీ లీలా. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. కానీ అవకాశాలు వరుసగా వచ్చాయని చెప్పొచ్చు. దీనికి కారణం శ్రీలీలా టాలెంట్ ఒకటి అయితే, శ్రీలీలా ఉన్న ఇంకో ప్లస్ తన డాన్స్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది శ్రీ లీలా. ఇకపోతే తెలుగులో నార్మల్ సినిమాలు చేసిన శ్రీలీలా… మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని సాధించుకుంది అని చెప్పొచ్చు.

ఇకపోతే ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోయిన్లు సౌత్ ఇండియాలో సెన్సేషన్ గా మారారు అని చెప్పొచ్చు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఇదివరకే చాలామంది హీరోయిన్స్ ఇలానే కొంతకాలం వరకు పాపులర్ అయ్యారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు