Anchor Shyamala : శ్రీలీల, రమ్యకృష్ణలతో యాంకర్ శ్యామల పోటీ… ఉనికి చాటుకోవడానికి ఇదో అవకాశం

Anchor Shyamala : యాంకర్ శ్యామల… నిజానికి ఈమె గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. కానీ, ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈమె చేసిన హాడావుడి అంతా ఇంత కాదు. ఓ పార్టీకి బహిరంగంగా సపొర్ట్ చేయ్యడమే కాదు, క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసింది. అంతేనా… ప్రత్యర్థి పార్టీలపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించింది. అలాగే ఓ స్టార్ హీరోను కూడా విమర్శించింది. ఆ స్టార్ హీరో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఈమె క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసిన పార్టీ అత్యంత దయానీయమైన పరిస్థితిలో ఓడిపోయింది. ఈ రెండు జరగడంతో శ్యామల సినిమా కెరీర్ ముగిసినట్టే అని, యాంకర్ గా కూడా ఛాన్స్ లు రావని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో యాంకర్ శ్యామలకు తన ఉనికిని చాటుకునే సమయం వచ్చింది.

ప్రస్తుతం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ నడుస్తున్నాయి. బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్ అంటూ పలు క్యాటగిరిల్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా, బెస్ట్ యాక్టర్.. సపొర్టింగ్ రోల్ (ఫీమేల్) క్యాటగిరిలో యాంకర్ శ్యామల నామినేట్ అయింది. విరూపాక్ష సినిమాలో సావిత్రి అనే పాత్రలో కనిపించింది. ఈ పాత్రలో శ్యామల నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కు నామినేట్ కూడా అయింది.

ఆమెతో పాటు రంగ మార్తండ సినిమా నుంచి రమ్యకృష్ణ, రైటర్ పద్మభూషణ్ నుంచి రోహిణి మొల్లేటి, బలగం మూవీ నుంచి రూపా లక్ష్మీ, భగవంత్ కేసరి నుంచి శ్రీలీల, సలార్ మూవీ నుంచి శ్రీయా రెడ్డి, మంత్ ఆఫ్ మదు నుంచి స్వాతి రెడ్డి కూడా నామినేట్ అయ్యారు.

- Advertisement -

రమ్యకృష్ణ, శ్రీలీల, రూపా లక్ష్మీ, శ్రీయా రెడ్డిలకు ఈ అవార్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. యాంకర్ శ్యామలకు ఈ అవార్డ్ రాలేకపోయినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, దానికి నామినేట్ అయినా… ఉనికిని చాటుకున్నట్టే. ఈ నామినేషన్ వల్ల విరూపాక్ష సినిమాలో సావిత్ర పాత్రలో శ్యామల ఫర్మామెన్స్ మరోసారి తెరపైకి వచ్చింది. ఎలక్షన్స్ తర్వాత ఛాన్స్ లు రావు అనే మాటలు కూడా ఇప్పుడు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా, యాంకర్ శ్యామలకు సరైన సమయంలో సరైన గుర్తింపు వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు