SIIMA Awards 2024 : సైమా అవార్డ్స్‌లో నానికి ‘దసరా’ పండగే… తలైవాతో సమానంగా న్యాచురల్ స్టార్

SIIMA Awards 2024 : సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవార్డ్స్ ఉంటాయి.. అందులో సైమా అవార్డ్స్ కూడా ఉన్నాయి.. ప్రతి ఏటా ఈ సినిమా ఇండస్ట్రీకి సైమా అవార్డులు వస్తుంటాయి.. సౌత్ ఫిల్మ్​ ఇండస్ట్రీకు చెందిన సినిమాలు, యాక్టర్స్, టెక్నిషియన్స్​ టాలెంట్​ను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్నో ఉన్నాయి.. సైమా అవార్డ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ లో రానున్నాయి.. ఈ అవార్డ్ వేడుకను ప్రతి ఏడాది దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.. అలాగే ఈ ఏడాది కూడా అక్కడే నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు..

ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో దుబాయ్ వేదికగా ఈ 12వ ఎడిషన్‌ వేడుకలు జరగనున్నాయి. అయితే తాజాగా ఈ పురస్కారాల కోసం పోటీ పడుతున్న సినిమాల జాబితాను సైమా విడుదల చేసింది.. ఈ అవార్డు ల నామినేషన్స్ లో ఈ ఏడాది సౌత్ నుంచి రెండు సినిమాలకు ఎక్కువ అవార్డులు వరించినట్లు తెలుస్తుంది.. అందులో 11 విభాగాల్లో తెలుగు నుంచి నాని దసరా, తమిళం నుంచి రజనీకాంత్‌ జైలర్‌ నామినేట్‌ అయ్యాయి.. రజనీకాంత్ తో సమానంగా నానికి అవార్డులు రాబోతుండటం విశేషం.. ఈ వార్త విన్న నాని ఫ్యాన్స్ సంబరాల్లో మునిపోయారు..

Awards for Nani Dussehra movie in 11 categories in Saima Awards
Awards for Nani Dussehra movie in 11 categories in Saima Awards

నాని దసరా సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఈ సినిమా నానికి కేరీర్ పాయింట్ అయ్యింది.. మాస్ లుక్ లో నాని కనిపించారు.. కథ పరంగా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.. ఈ సినిమాకు ఇన్ని అవార్డులు రావడం మామూలు విషయం కాదు.. రజినీకాంత్ తో సమానంగా వచ్చాయి.. ఇక ఈ ఏడాది సైమా అవార్డులు మిగిలిన భాషల్లో ఏ సినిమాకు వచ్చాయో చూస్తే.. మలయాళం నుంచి టొవినో థామస్‌ 2018, కన్నడ నుంచి దర్శన్‌ కాటేర 8 విభాగాల్లో పోటీ పడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే నాలుగు చిత్రాలు కూడా అటు కథ పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్​ ముందు బ్లాక్ బ్లస్టర్​ హిట్​గా నిలిచాయి. ఆడియెన్స్ ఈ చిత్రాలకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.. ప్రస్తుతం ఈ సినిమా హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు