డైరెక్టర్ సుకుమార్ కూతురికి… దాదాసాహెబ్ ఫాల్కే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ దర్శకుడు సుకుమార్, తబితా ల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డికి అందజేశారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన సామాజిక సందేశాత్మక చిత్రం ‘గాంధీ తాత చెట్టు’లో ఆమె అమోఘమైన నటనకు గాను ఈ అవార్డు లభించింది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

సుకృతి ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో 8వ తరగతి చదువుతోంది. ఈ చిత్రం గతంలో అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది మరియు అవార్డులను పొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో, సుకృతి బెస్ట్ డెబ్యూటెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు, న్యూఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ ఉత్తమ చిత్రం మరియు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అవార్డులు గెలుచుకుంది. సుకృతి పలువురి మన్ననలు పొందడం విశేషమని మేకర్స్ తెలిపారు.

- Advertisement -

ఇవి కాకుండా మరెన్నో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ప్రదర్శనకు ఆహ్వానాలు అందుతున్నాయి. పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, శేష సింధూరావు నిర్మాతలు. ఈ సినిమాకి దర్శకత్వం పద్మావతి మల్లాది నిర్వహించారు మరియు తబిత సుకుమార్ సమర్పకులు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు