Johny Master : జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు.. ఏ సినిమాకో తెలుసా?

Johny Master : సినీ రంగానికి సంబందించిన ప్రతిష్టాత్మకంగా భావించేవి జాతీయ అవార్డులు.. సినిమా రంగానికి చెందిన ఎన్నో అవార్డులు ఉంటాయి. అందులో ఇవి చాలా ప్రత్యేకమైనవి. నేడు 70వ జాతీయ అవార్డ్‌లను ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమాలకు పెద్దగా అవార్డులు రాలేదు. తమిళ, కన్నడ, హిందీ చిత్రాల హవానే కొనసాగింది. ఈ అవార్డులలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కూడా అవార్డు వచ్చింది. ఏ సినిమాకు ఆయనకు అవార్డు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

జానీ మాస్టర్‌కి ఈ అవార్డు వచ్చింది తెలుగు సినిమాకు కాదు. తమిళ్‌ చిత్రానికి గాను జాతీయ అవార్డు ప్రకటించారు. పైగా ఆయన సతీష్ కృష్ణన్‌తో కలిసి ఉమ్మడిగా అవార్డు అందుకోనున్నారు. తమిళ్ చిత్రం తిరుచిత్రాంబళం అనే సినిమాకు ఈయనకు అవార్డు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో తిరుగా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డ్ వరించింది.. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

National Award for Johnny Master.. Do you know which movie?
National Award for Johnny Master.. Do you know which movie?

ఇకపోతే ఈ సారి తెలుగులో పెద్దగా అవార్డులు రాలేదు. తమిళ, కన్నడ, హిందీ చిత్రాల హవానే కొనసాగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తీకేయ 2 నిలిచింది. ఇక తమిళంలో పొన్నియన్ సెల్వన్, కన్నడలో కేజీఎఫ్ సినిమాలను ఎక్కువ అవార్డులు వరించాయి. ప్రతిసారిలానే ఈ సారి కూడా ఉత్తరాది సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. తెలుగులో అతి తక్కువ వచ్చినట్లు తెలుస్తుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 నిలవగా.. బెస్ట్ కొరియో గ్రాఫర్ కేటగిరీలో జానీ మాస్టర్‌ను జాతీయ అవార్డ్ వరించింది. ఇక మొత్తం 28 భాషలలో విడుదలైన 300కు పైగా సినిమాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. అందులో ఎక్కువగా సౌత్ యాక్టర్స్ గెలుచుకోవడం విశేషం.. జానీ మాస్టర్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. తెలుగులో గేమ్ ఛేంజర్ ఓ పాటకు కంపోజ్ చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు