NTR Film Awards 2024 Winners: ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డులను అందుకున్న విజేతలు.. బెస్ట్ హీరోగా ఆనంద్ దేవరకొండ..

NTR Film Awards 2024 Winners: టాలీవుడ్ స్టార్ హీరో స్వర్గీయ నటుడు నందమూరి తారక రామారావు పేరుతో సినిమా రంగంలోని నటీనటులకు పురస్కారాలు అందించారు. ఇటీవలే ఈ అవార్డ్స్ ను ప్రకటించారు.. సినీ రంగంలోని అన్ని విభాగాల్లో ప్రఖ్యాతి గాంచిన నటీనటులకు ఈ అవార్డ్స్ అందజేశారు.. తాజాగా ఈ అవార్డ్స్ ను కళావేదిక ఆర్‌వి రమణమూర్తి, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ అవార్డును సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అందుకున్నారు.. మరి ఇండస్ట్రీలో ఎంత మంది ప్రముఖులు ఈ అవార్డులను అందుకున్నారో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగిన ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అనేకమంది ప్రముఖులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ నటీనటులకు, టెక్నిషియన్స్‌కు ఎన్టీఆర్ అవార్డ్స్ అందజేశారు. మోహన్ కృష్ణ, మురళీ మోహన్, నందమూరి మోహన రూపతోపాటు అవార్డ్స్ అందుకున్న సెలబ్రిటీలు హాజరయ్యారు.. ఈ అవార్డులను బెస్ట్ లిరిక్ రైటర్‌గా కాసర్ల శ్యామ్, బెస్ట్ రైటర్‌గా కల్యాణ్ చక్రవర్తి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రఘు కుంచె, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్‌గా శరణ్య ప్రదీప్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా హర్షవర్ధన్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్‌గా నాగేంద్ర, బెస్ట్ కమెడియన్‌గా రచ్చ రవి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా దాశరధి శివేంద్ర, బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా మంగ్లీ, బెస్ట్ డెబ్యూ సపోర్టింగ్ యాక్టర్‌గా లక్ష్మణ్ మీసాల, బెస్ట్ నెగెటివ్ సపోర్టింగ్ రోల్‌లో సాహితీ దాసరి, బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా విజయ్ పొలాకి, బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్‌గా ధ్రువన్, బెస్ట్ ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్, బెస్ట్ మేల్ సింగర్‌గా రాహుల్ సిప్లిగంజ్, బేబి సినిమాకు గాను ఆనంద్ దేవరకొండ తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు..

Winners who received NTR Film Awards.. Anand Deverakonda as the best hero..
Winners who received NTR Film Awards.. Anand Deverakonda as the best hero..

అలాగే ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును సీనియర్ నటుడు మురళీమోహన్, నందమూరి మోహన్ కృష్ణ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమాకు బెస్ట్ నిర్మాతగ సాగు గార్లపాటి అవార్డును అందుకున్నారు.. ఇక ఈ వేడుకలో అవార్డ్స్ అందుకున్న వారితో పాటు తెలుగు సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్, దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి తదితరులు హాజరయ్యారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు