Bigboss season 7: నెమ్మదిగా మారిపోతున్న యావర్?

బిగ్ బాస్ సీజన్ 7 లో 31వ రోజు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ అందరి పవర్ అస్త్రాలను తీసుకుని హౌస్ మేట్స్ ని కూడా సాధారణ కంటెస్టెంట్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో యాంగ్రీ మ్యాన్ గా పేరుతెచ్చుకున్న యావర్ రోజురోజుకి మారిపోతున్నాడు. ఒక నార్మల్ మోడల్ గా కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రిన్స్ యావర్ అదృష్టవశాతూ మొదటివారమే ఎలిమినేట్ కాకుండా బయటపడ్డాడు.

ఇక తర్వాత నుండి తనదైన శైలిలో ఆట ఆడుతూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. అయితే యావర్ కి ఇప్పటివరకు ఉన్న రెండు లోపల వల్లనే ఏ విషయంలోనైనా టాప్ లోకి రాలేకపోతున్నాడన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి భాష, మరొకటి కోపం. భాష పరంగా ముందుగా ఇంగ్లీష్ లోనే మాట్లాడినా, నాగార్జున చెప్పిన తర్వాత నుండి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. అయితే తన కోపాన్ని మాత్రం ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

అయితే అందరూ అదే విషయాన్ని చెప్తుండగా, ఆఖరికి నాగ్ కూడా చెప్పడంతో తన తప్పుని సరిదిద్దుకుంటానని చెప్పాడు. అందుకే గత రెండు మూడు రోజుల నుండి కొన్ని విషయాల్లో ఫైర్ అవ్వాలనుకున్నప్పటికీ తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. నిన్న నామినేషన్ల ప్రక్రియలో ప్రియాంక తో అలాంటి సందర్భమే రాగా, ప్రియాంక అరుస్తున్నా, యావర్ కొంచెం నెమ్మదిగానే మాట్లాడాడు.

- Advertisement -

తాజాగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో యావర్ ని సంచాలక్ గా నియమించగా, గేమ్ లో తన పార్టనర్ అయిన తేజ ని గట్టిగా పిలుస్తున్నాడే తప్ప, మిగతా వాళ్ళని ఏమి అనలేదు. పైగా సంచాలక్ గా ఒకర్ని హై, మరొకర్ని లౌ చేయకుండా, తన టీం ని తన టీమ్ ని అందరికంటే తక్కువ చేసుకుంటూ, వేరే టీమ్ వాళ్ళని విన్ చేసాడు. దీన్ని చూసి ఆడియన్స్ యావర్ లో ఈ మార్పుకి సంతోషిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు