Biggboss house: సరదా టాస్క్ లో కూడా గొడవేనా అమర్!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవిక్షన్ టాస్క్ పూర్తవగా ఆ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ పూర్తవగానే మరో టాస్క్ మొదలైంది బిగ్ బాస్ ఇంట్లో. అయితే టాస్క్ కి ఇంకా పేరు పెట్టలేదు గాని, బిగ్ బాస్ మాత్రం మొదలు పెట్టేముందు హౌస్ లో అందర్నీ టెన్షన్ కి గురి చేసాడని తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో మర్డర్ జరిగిందని, ఆ మర్డర్ ఎవరు చేసారో కనిపెట్టమని టాస్క్ లో పోలీస్ వేషాలేసిన అమర్, అర్జున్ లకి చెప్పడం జరిగింది.

ఇక సరదాగా మొదలైన ఈ టాస్క్ లో ఓ హోటల్ లాగా మార్చిన బిగ్ బాస్ హత్యకు గురయింది మిస్సెస్ బిగ్ బాస్ అని తెలియచేసాడు. అయితే ఈ ఫన్నీ టాస్క్ మొదట చాలా సరదాగానే మొదలైంది, కానీ టాస్క్ జరుగుతున్న కొద్దీ అమర్ రెచ్చిపోతూ శోభా శెట్టి పై నోరు పారేసుకున్నట్టు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో తెలిసింది. ఇక అక్కడితో అంటుకున్న చిచ్చు అశ్విని పైకి మళ్లింది. అయితే ఫన్నీ గా జరిగే ఈ టాస్క్ లో కూడా అమర్ అంత ఓవర్ రియాక్ట్ అవడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే అమర్ ఇలా రియాక్ట్ అవడం కూడా టాస్క్ లో భాగమేనని అమర్ దీప్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ మరో నెల రోజుల్లో ముగియనుంది కాబట్టి, టాప్ 5 లో ఎవరుంటారన్న ఆసక్తి జనాల్లో పెరిగిపోతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు