Biggboss season7: కెప్టెన్ కావాలనే మోజులో అమర్ సైకో అయిపోయాడా?

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో వీర సింహాలు టీం నుండే ఐదుగురు పోటీ పడగా, లాస్ట్ ఫిజికల్ టాస్క్ లో చాలా రచ్చ రచ్చ అవుతుందని చెప్పొచ్చు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో అమర్ దీప్, శివాజీ, ప్రియాంక, అశ్విని, భోలే ల మధ్య కెప్టెన్సీ టాస్క్ జరగగా, దీనికి సంచాలక్ గా ప్రశాంత్ నియమించబడ్డాడు.

అయితే ఈ టాస్క్ లో అమర్ దీప్ తన ఆట మాత్రమే ఆడే క్రమంలో మరీ ఓవర్ గా ప్రవర్తించాడు. ముందుగా అశ్విని ని బయటికి పంపించగా, ఆ తర్వాత భోలే తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు చేయేసుకున్నట్టు ప్రోమో లో అనిపిస్తుంది. అయితే అమర్ దీప్ ఈ విషయంపై ఒప్పుకోకుండా అందరితో గొడవ పడ్డాడు.

ఆ తర్వాత శివాజీ నుండి బ్యాగ్ ఉన్న పళంగా బ్యాగ్ లాక్కోగా, శివాజీ భుజం పై మళ్ళీ గాయమైంది. దాంతో శివాజీ ఆ టాస్క్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత అమర్ ప్రియాంక మధ్యే ఈ టాస్క్ జరగగా, ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో ఈ రాత్రి తెలుస్తుంది.

- Advertisement -

Read more :

Biggboss season7: గౌతమ్ శివాజీతో వాదించి తప్పు చేస్తున్నాడా?

అయితే కెప్టెన్ అవ్వాలనే మోజులో అమర్ దీప్ ఈ టాస్క్ లో మరీ మూర్ఖంగా ఉన్నాడని అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్ కాబట్టి, అందర్నీ ఓడించినా, ఈ రోజు తన బిహేవియర్ కి ఆదివారం నాడు నాగ్ నుండి తప్పక పనిష్మెంట్ లభిస్తుందని నెటిజన్లు అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు