Bigg Boss 8: హౌస్ లోకి మరో హాట్ బ్యూటీ.. షో దద్దరిల్లాల్సిందే..!

Bigg Boss 8.. తెలుగు బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. చాలామంది బిగ్ బాస్ సీజన్-8 కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ను కూడా విజయవంతం చేయడం కోసం సిద్ధమవుతున్నారు. గత సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో టిఆర్పీ రేటింగ్ విషయంలో కూడా కాస్త మెరుగ్గానే కనిపించింది. ముఖ్యంగా కంటెస్టెంట్లతో గొడవ అలాగే రతికాతో ప్రేమాయణం, రైతు బిడ్డ , బీ టెక్ స్టూడెంట్స్ అంటూ ఇలా ఎన్నో గొడవలు, ప్రేమలు, కొట్లాటలు, ఫ్రెండ్షిప్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్మెంట్ చేశాయి. చివరిగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా బిగ్ బాస్ -7 లో నిలిచారు.

Bigg Boss 8: Another hot beauty enters the house.
Bigg Boss 8: Another hot beauty enters the house.

బిగ్ బాస్ సీజన్ 8 కి సర్వం సిద్ధం..

ఈ జోష్ లోనే ఇప్పుడు సీజన్ 8 కోసం సిద్ధమవుతున్నారు. అయితే రీసెంట్గా ఒక ప్రోమో ను కూడా బిగ్ బాస్ సంస్థ విడుదల చేసింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో బిగ్ బాస్ -8 ఉండబోతున్నట్లు బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వెళ్తారు అనే విషయం పైన ఎప్పటిలాగే సోషల్ మీడియాలో కూడా పలు రకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి హౌస్ లోకి ఎక్కువగా హాట్ బ్యూటీల పేర్లు చాలా వినిపిస్తూ ఉన్నాయి.

హౌస్ లోకి హాట్ యాంకర్ విష్ణుప్రియ.

ఎక్కువగా బుల్లితెర సీరియల్స్, సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించిన వారు, యాక్టర్స్ ఈసారి హౌస్ లోకి ఎంట్రి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కుమారి ఆంటీ, బర్రెలక్క, కిర్రాక్ ఆర్పి, అంజలి పవన్, వర్షిణి, బుల్లెట్ భాస్కర్, రీతూ చౌదరి, సుప్రీత, నయన పావని, సోనియా సింగ్, వంశి, తదితరులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ గా పేరుపొందిన విష్ణు ప్రియ కూడా రాబోతోంది అని సమాచారం. గతంలో హౌస్ లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చినా.. వదులుకుంది. కానీ ఈసారి సీజన్ -8 లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

గతంలో కూడా అవకాశం..

అయితే అభిమానులు కూడా విష్ణు ప్రియ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.. ఎందుకంటే గతంలో అడపాదడపా షోలకి యాంకర్ గా చేసిన విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు .సోషల్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్ ఫోటోలతో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది విష్ణు ప్రియ. అంతేకాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్లను కూడా చేస్తూ భారీగానే క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం విష్ణు ప్రియ కు సంబంధించి ఈ న్యూస్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది. మరి అభిమానుల కోరిక మేరకు విష్ణు ప్రియ హౌస్ లోకి వస్తున్న లేక ఎప్పటిలాగే తప్పుకుంటున్న అన్నది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు