Bigg Boss Telugu 7 : గ్రాండ్ ఫినాలేకు క్యూ కడుతున్న సినీ జనాలు… ఓవర్ అవుతోందా?

పాపులర్ బుల్లితెర షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. కొన్ని వారాలుగా ఈ సీజన్ విన్నర్ ఎవరెవరు అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఆసక్తికి ఈ వారం తెరపడబోతోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రాండ్ ఫినాలేను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారట మేకర్స్. ఈ షోకు సినీ జనాలు కూడా క్యూ కడుతూ ఉండడం ఇక్కడ విశేషం. మరి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు పాలు పంచుకోబోతున్నారు? ఏఏ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు? అనే వివరాల్లోకి వెళితే…

ఈ వీకెండ్ ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే లో పలువురు తారలు అతిథులుగా హాజరైనట్టు సమాచారం. వంద రోజులకు పైగా కొనసాగిన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు ఫైనలిస్టులుగా ఉన్నారు. ప్రస్తుతం హౌస్ లో యావర్, శివాజీ, అర్జున్, అమర్దీప్, ప్రశాంత్, ప్రియాంక ఉన్నారు. వీరిలో ఒకరు సీజన్ సెవెన్ విన్నర్ కాబోతున్నారు. ఇక గ్రాండ్ ఫినాలేలో నలుగురు టాలీవుడ్ సెలబ్రిటీలు మెరువబోతున్నారు. ఇప్పటికే హౌస్ లో శ్రీముఖి సందడి గురించి వార్తలు వస్తుండగా, కొంతమంది దర్శకులు కూడా ఈ షోకు హాజరవుతున్నారని సమాచారం. ఇక కళ్ళు మిరుమిట్లు గొలిపే పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఓ హాట్ బ్యూటీ కూడా రెడీ అయిందట.

యంగ్ అండ్ హార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిందని తెలుస్తోంది. అలాగే మాస్ మహారాజా రవితేజ గెస్ట్ గా హాజరై, తన లేటెస్ట్ మూవీ “ఈగల్ “నీ ప్రమోట్ చేసుకోబోతున్నాడని టాక్. లేటెస్ట్ మూవీ “బబుల్ గమ్” టీం కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేయబోతుందట. ఇక ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అశ్విని బోర్డ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరికీ షాక్ ఇస్తుందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా శోభా శెట్టి, గౌతమ్, శుభ శ్రీ కూడా తమ డాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తారట. ఇక మరోవైపు గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వేదికపై నాగార్జున తన కొత్త సినిమా “నా సామిరంగ” మూవీని ప్రమోట్ చేసుకుంటాడు అంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీకి మహేష్ బాబు గెస్ట్ గా హాజరు కాబోతున్నాడని, ఆయన చేతుల మీదుగానే “నా సామి రంగ” టీజర్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. మహేష్ బాబు గెస్ట్ గా వస్తారా రారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ, నాగార్జున “నా సామి రంగ” మూవీ టీజర్ మాత్రం ఇక్కడే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా “నా సామిరంగ” టీం మొత్తం బిగ్ బాస్ వేదికపై ప్రత్యక్షం అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా, ఈ ఆదివారం బుల్లితెర ఆడియన్స్ మాత్రమే కాకుండా మిగతా అందరూ ఫ్యామిలీలతో కలిసి టీవీ లకు అతుక్కుపోయేలా చాలా హడావిడిగా ఎన్నో ప్లాన్స్ చేసి పెట్టుకున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ఆదివారం రోజు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

- Advertisement -

కాగా ఇప్పటికే విజేత ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా టాక్ నడుస్తోంది. మొదటినుంచి నాగార్జున ఉల్టా పల్టా అని చెప్పుకొస్తున్నాడు. మరి ఆయన అన్నట్టుగా ఫైనల్ ఎపిసోడ్ లో ఎలాంటి సర్ప్రైజ్ లు ఉంటాయో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు