Bigg Boss Telugu 7 : ఈ వీక్ డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?

రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ముగింపు దశకు చేరుకుంటుంది. ప్రస్తుతం వస్తున్నా రెస్పాన్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులు ఫుల్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గత వారం అశ్విని, రాధిక షో నుంచి ఎలిమెంట్ అయ్యారన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వీరిలో టాప్ 5కి ఎవరు చేరుకుంటారు? గ్రాండ్ ఫినాలేలో ఎవరు ఉండబోతున్నారు? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు.
ఫైనల్స్ కు అందరి కంటే ముందు చేరుకోవడానికి బిగ్ బాస్ పెట్టిన ఫినాలే అస్త్రను ఏఏ కంటెస్టెంట్స్ గెలుచుకుంటారు ? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టికెట్ తో ఫినాలే స్టార్ట్ కాగా, అందులో భాగంగా పలు గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్.

ఫస్ట్ గేమ్ లో అర్జున్ గెలవగా, రెండో టాస్క్ లో ప్రశాంత్ విన్ అయ్యాడు. మూడో టాస్క్ లో అమర దీప్ విజేత కాగా, తక్కువ పాయింట్లు ఉన్న వారిలో ఒక్కొక్కరుగా రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఈ వీకెండ్ కు సంబంధించిన ఓటింగ్ కొనసాగుతోంది. మరి ఈ వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారు? అన్న విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో గౌతమ్ కృష్ణ, శివాజీ, యావర్, శోభ శెట్టి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి ఉన్నారు. 13వ వారానికి సంబంధించిన నామినేషన్ లో హౌస్ మేట్స్ అందరూ ఉన్నారు. ఒక్క అమర దీప్ తప్ప. ఈవారం ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నట్టు సమాచారం.

రెండవ స్థానంలో శివాజీ ఉండగా, మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఆ తర్వాత స్థానాల్లో గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రియాంక జైన్, శోభ శెట్టి డేంజర్ జోన్ లో కి వెళ్లిపోయారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిద్దరి ఓటింగ్ శాతం లో పెద్ద తేడా ఏం లేదట. దీంతో ఈవారం డేంజర్ జోన్ లోకి అర్జున్ కూడా వెళ్లిపోయాడు. కానీ ఫినాలే అస్త్రలో అర్జున్ గెలిచాడు కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఇక ఓటింగ్ కి ఇంకాస్త సమయం ఉండడంతో ఈ లెక్కలు తారమరయ్యే అవకాశం లేకపోలేదు. ఇవి జస్ట్ లీక్స్ మాత్రమే. మరేం జరుగుతుందో తెలియాలంటే వీకెండ్ దాకా వేచి చూడాల్సిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు