Bigg Boss Telugu Season 8 : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన నాగ్… బిగ్ బాస్ నుంచి ఎంత వసూలు చేస్తున్నాడంటే?

Bigg Boss Telugu Season 8 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 8 త్వరలోనే తెరపైకి రాబోతోంది. రీసెంట్ గా మేకర్స్ కొత్త సీజన్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా, ప్రస్తుతం కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ గా వ్యవహరించబోతున్న కింగ్ నాగార్జున ఈసారి బిగ్ బాస్ కోసం ఎంత రెమ్యూనరేషన్ వసూలు చేయబోతున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన ఎంత వసూలు చేస్తున్నాడో ఓ లుక్కేద్దాం పదండి.

భారీగా పారితోషికం పెంచేసిన నాగ్

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రియాలిటీ షో ఆగస్ట్ చివరి వారంలో ప్రసారం కానుంది. ఎనిమిదవ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్నారు. అయితే ఈ సీజన్ కోసం నాగార్జున ఎంత పారితోషికం వసూలు చేస్తున్నాడు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే ఇటీవల కాలంలో నాగ్ పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఈ ఏడాది మొదట్లో నా సామి రంగా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అక్కినేని ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అలాగే కుబేర వంటి సినిమాలతో ఆయన బిజీగా ఉండడం ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి నిదర్శనం. తాజాగా రజినీకాంత్ కు నాగ్ విలన్ గా నటించబోతున్నాడు అనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మరి ఇంత డిమాండ్ ఉన్న హీరో బుల్లితెర షోను రన్ చేయాలంటే పారితోషికం కూడా అదే రేంజ్ లఓ ఉంటుంది కదా. అందుకే గత సీజన్లతో పోలిస్తే నాగ్ బిగ్ బాస్ సీజన్ 8కు భారీ స్థాయిలో పారితోషికం పెంచినట్టు ప్రచారం జరుగుతోంది.

Bigg Boss 8 announced- Show to have new rules | Latest Telugu cinema news |  Movie reviews | OTT Updates, OTT

- Advertisement -

దాదాపు 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. గత సీజన్‌లో ఈ స్టార్ హీరోకి బిగ్ బాస్ షోను హోస్ట్ చేసినందుకుగానూ 20 కోట్లు చెల్లించారు. అయితే తాజా సీజన్ బిగ్ బాస్ కోసం ఆయన ఏకంగా తన పారితోషికాన్ని 10 కోట్లు పెంచి 30 కోట్ల రౌండ్ ఫిగర్ వసూలు చేయడం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజానికి ఈ విషయంపై ఇంకా అఫిషియల్ గా ఎలాంటి సమాచారం లేదు.

కంటెస్టెంట్స్ వీల్లేనా ?

కాగా బిగ్ బాస్ సీజన్ 8లఓ కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో రీసెంట్ గా ఫుడ్ తో పాపులర్ అయిన కుమారి ఆంటీ, బర్రెలక్క, రీతు చౌదరి, క్రికెటర్ అంబటి రాయుడు, అమృత ప్రణయ్, విష్ణుప్రియ, హేమ, వేణు స్వామి, సురేఖవాణి, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పి, బంచిక్ బబ్లూలాంటి సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అల్మోస్ట్ అందరూ ఇటీవల కాలంలో వివాదాల్లో నిలిచిన వాళ్ళే కావడం గమనార్హం. మరి ఈ వైరల్ అవుతున్న లిస్ట్ లో ఎంతమంది ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టబోతున్నారు అనేది వెయిట్ అండ్ సీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు