Biggboss season 7: ఫినాలే అస్త్ర నాలుగో టాస్క్ ఎత్తార జెండా..!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ మొదలైందన్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరికీ వారు, తమ గేమ్ ని బాగా ఆడుతున్నా, ఓడిపోయేసరికి వాళ్లకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ గ్రూపిజం చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా బ్యాచ్ ఈ విషయంలో ముందున్నారు. అయితే ఈ టాస్క్ లో మొదటి ఛాలెంజ్ లో అర్జున్ గెలవగా, రెండో ఛాలెంజ్ లో అమర్ దీప్, మూడో ఛాలెంజ్ లో కూడా అమర్ దీప్ గెలవడం జరిగింది.

ఇక ఈ టాస్క్ లో నాలుగో ఛాలెంజ్ కూడా మొదలైంది. ఎత్తర జెండా అంటూ సాగే ఈ ఛాలెంజ్ లో ఒక వంగి ఉన్న ఒక పడవపై కంటెస్టెంట్స్ ఇసుక నింపాలని, ఆ ఛాలెంజ్ లో ముందు ఎవరు ఎక్కువ నింపితే వాళ్లే ఆ టాస్క్ విజేతలని చెప్పడం జరిగింది.

ఇక ఈ టాస్క్ లో ఎవరికీ వారు మళ్ళి ఆడుతున్నా, వేగంగా ప్రశాంత్, యావర్, అమర్ దీప్ లు యాక్టీవ్ గా ఆడారు. ఇక ఈ ఛాలెంజ్ లో శివాజీ, శోభా సంచాలక్ లుగా నిలిచారు. అయితే ఈ టాస్క్ పూర్తయ్యాక కూడా బిగ్ బాస్ మరో టాస్క్ పెడతారా? లేదంటే జరిగిన నాలుగు ఛాలెంజ్ లని బట్టి విజేతని నిర్ణయిస్తారా అనేది తెలియాలి. ఏది ఏమైనా ఈ టాస్క్ లో అమర్ దీప్, ప్రశాంత్ మధ్య పోటీ ఎక్కువ గా జరుగుతుందని చెప్పాలి. పాయింట్స్ కూడా ఎప్పుడూ మారుతూ వస్తున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు