Biggboss season7: అనుకున్నట్టే శోభ ని కడిగిపడేసిన నాగ్!

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 లో ఎనిమిదో వారంలో ముందు వారాల కంటే ఎక్కువ గొడవలు జరిగాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అందరికంటే ఎక్కువ ఇష్యూ చేసింది శోభా శెట్టి. లాస్ట్ వీక్ భోలే తో గొడవ మొదలుకొని ఈ వీక్ లో కూడా యావర్ సహా కొంతమంది కంటెస్టెంట్స్ తో రచ్చ చేసింది. ఇక కెప్టెన్సీ టాస్క్ టైం లో యావర్ తో జరిగిన గొడవ గురించి తెలిసిందే.

అయితే ఆడియన్స్ ఈ వారం శోభా శెట్టి బిహేవియర్ కి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారని అనుకున్నారు. అనుకున్నట్టుగానే నాగార్జున అందరికంటే ముందుగా శోభా నుండే తప్పులు చెప్పడం స్టార్ట్ చేసారు. ముందుగా శోభా యావర్ ని పిచ్చోడు అన్న పదాన్ని గుర్తు చేస్తూ, లాస్ట్ వీక్ భోలే అన్న ఎర్రగడ్డ పదాన్ని లింక్ చేస్తూ ఇలా అనడం ఎంత వరకు కరెక్ట్ అని శోభా ని నిలదీసాడు.

ముందుగా శోభా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నప్పటికీ, వీడియో తో సహా నాగార్జున చూపించడం తో శోభా తన తప్పు ఒప్పుకుంది. ఇక మీదట ఎవరినైనా డిఫెండ్ చేసే ముందు తాను కూడా ఒక్కసారి అలోచించి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇటు యావర్ కి కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోమని చాలా రోజుల తరువాత గట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగ్. ఇక ఇదే గాకుండా ఈ వారంలో ఇతర కంటెస్టెంట్స్ చేసిన తప్పులని కూడా గుర్తు చేస్తూ నాగార్జున అందరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు