Ambanti Arjun: బిగ్ బాస్ ఇచ్చిన కొత్త టాస్క్ తో హౌస్ లో చిచ్చు రేగనుందా?

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ లో జరిగిన లొల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నామినేషన్ల లో శోభా శెట్టి, ప్రియాంక, అమర్, అశ్విని, యావర్, అమర్ ల మధ్య ఎక్కువ వాగ్వాదం జరగగా, అందులో ఆడియన్స్ కి అడ్డంగా దొరికింది అశ్విని. రీసన్ తో సంబంధం లేకుండా నామినేట్ చేయాలనీ చూడగా, ఏమైనా అంటే ఇప్పుడే ఏడుపు మొహం పెట్టేయడం చేసేది.

ఇదిలా ఉండగా ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే బిగ్ బాస్ లో మరో పెద్ద టాస్క్ మొదలైంది. అదే కెప్టెన్సీ టాస్క్. గత కొన్ని రోజులుగా నెలరోజులుగా ఈ కెప్టెన్సీ టాస్క్ లో చాలా రచ్చ జరుగుతుంది. ఈ వారం గౌతమ్ కెప్టెన్ కాగా, వచ్చే వారం కెప్టెన్సి టాస్క్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది.

అయితే బిగ్ బాస్ ఇచ్చిన హోల్ అఫ్ బాల్ అనే ఈ టాస్క్ లో, ఒక పైపు నుండి చిన్న చిన్న బాల్స్ పడుతూ ఉంటాయి. వాటిని ఎవరు ఎక్కువ దక్కించుకుంటే వాళ్ళే విజేతలు అని డిసైడ్ చేస్తారు. ఫిజికల్ టాస్క్ లో భాగమైన ఈ గేమ్ లో అర్జున్, యావర్ తో పాటు హౌస్ సభ్యులు పోటా పోటీగా తోసుకుంటూ బాల్స్ సంపాదించారు. అయితే అదే వీళ్ళ మధ్య చిచ్చు లేపేలా ఉందని అనిపిస్తుంది.

- Advertisement -

అలా తోసేయడం మంచిది కాదని, రతిక, భోలే కలిసి అర్జున్ కి చెప్తుంటే, గౌతమ్ కూడా మిమ్మల్ని తోసాడు, నన్నంటారేంటని అన్నాడు. ఏది ఏమైనా ఇది ఫిజికల్ టాస్క్ కాబట్టి ఈ గేమ్ వల్ల హౌస్ లో చిచ్చు రేగడం కంఫర్మ్ అని ఆడియన్స్ భావిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు