Amardeep: ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసాడని చెప్తున్న ప్రియాంక..

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం మొత్తం గ్రాండ్ ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ జరిగిందన్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో అంబటి అర్జున్ గెలిచి బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇక ఈ వారం శనివారం వీకెండ్ కావడంతో నాగార్జున హౌస్ మేట్స్ తో ఎంటర్టైన్ చేయడానికి, అలాగే ఎలిమినేషన్ కోసం రానే వచ్చాడు.

అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హౌస్ మేట్స్ తో ఈ వారం చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ నాగార్జున స్వీట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నాగార్జున ప్రియాంక ని తన పాయింట్స్ ని గౌతమ్ కి ఇచ్చి, ఆ తరవాత గౌతమ్ ఓడిపోయాక, గౌతమ్ పాయింట్స్ ని అమర్ కి ఇప్పించావు, ఎందుకు? ఏమైనా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడా? అని నాగార్జున అడిగాడు.

దానికి ప్రియాంక నవ్వుతూనే అయినా, సీరియస్ గా నిజంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసాడు సర్ అని అంది. అక్కడ ప్రియాంక సింపుల్ గా చెప్దామని అనుకున్నా, ఇది సీరియస్ మేటర్ అని ఆడియన్స్ కి తెలుసు. ఎందుకంటే అమర్ దీప్ ఈ టాస్క్ లో ప్రియాంక నే కాకుండా, శివాజీ, శోభా, యావర్, ప్రశాంత్ ఇలా ఎవరు ఓడిపోతే వాళ్ళని పాయింట్స్ ఇవ్వమని అడిగాడని తెలిసిందే.

- Advertisement -

కానీ ప్రియాంక తన ఫ్రెండ్ అయ్యి, గౌతమ్ కి పాయింట్స్ ఇవ్వడం జీర్ణించుకోలేని అమర్ చాలా వరకు ప్రియాంక ని అవైడ్ చేయడం మొదలు పెట్టాడు. తట్టుకోలేని ప్రియాంక ఓ సందర్భంలో ఏడ్చింది. కానీ శివాజీ చొరవతో సర్దుకుంది. అయితే అమర్ కూల్ అయింది మాత్రం నిజంగా గౌతమ్ పాయింట్స్ ఇచ్చినప్పుడే అని షో చూస్తున్న వాళ్ళకి అర్ధమైపోతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు