Biggboss season7: ఆ కారణంగా కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకున్న శివాజీ?

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ముందుగా హల్ అఫ్ బాల్స్ టాస్క్ ని రెండు టీం ల మధ్య పెట్టగా, కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అందులోంచి వీర సింహాలు టీం మాత్రమే కెప్టెన్సీ టాస్క్ కి అర్హులైనట్టు తెలిసింది.

అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా తాజాగా నిర్వచించిన ఆటలో ఆట ఆడుతున్న ఐదుగురికి ఐదు సంచులు ఇవ్వగా, అందులో థర్మాకోల్ బాల్స్ ని నింపారు. ఒప్పొసిట్ ప్లేయర్ ఆ బ్యాగ్ లో నుండి ఆ బాల్స్ ని పడేస్తూ ఖాళీ చేయాలి. బెల్ మోగేలోగా ఎవరి బ్యాగ్ ఎక్కువ బరువుంటే వాళ్లే కెప్టెన్ గా అవుతారని బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

ఫిజికల్ టాస్క్ లో భాగంగా జరిగిన ఇందులో ముందుగా అశ్విని, భోలే బయటికి వచ్చేయగా, శివాజీ నుండి అమర్ దీప్ బ్యాగ్ లాక్కోగా, ఒక్కసారిగా శివాజీ బ్యాగ్ ని వదిలేసి దూరంగా వెళ్ళాడు. అమర్ దీప్ ఒక్కసారిగా బ్యాగ్ ని లాక్కునే ప్రయత్నంలో శివాజీకి తన భుజం ఇంజ్యూరీ కారణంగా కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకుంటున్నట్టు బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

- Advertisement -

అయితే శివాజీ కి ఆ గాయం కాకుండా ఉండుంటే ఈ టాస్క్ లో ఖచ్చితంగా శివాజీయే గెలిచేవాడని చెప్పొచ్చు. ఇక అమర్ దీప్ ప్రియాంక ల మధ్య జరిగిన ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు