Biggboss season7: శోభా వల్ల తన పూలని కూడా అమర్ కి ఇచ్చేసిన శివన్న!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో విజేత అయిన వారు నేరుగా ఫైనల్స్ కి చేరుకుంటారని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక ఈ టాస్క్ లో ఎవరికి వారు గ్రూప్ గేమ్ ఆడకుండా ఆడాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఈ టాస్క్ లో విన్ అవడం అందరికి ముఖ్యమే. ఇక నాలుగు రకాలుగా మొదలైన ఈ టాస్క్ లో మొదటి ఛాలెంజ్ లో అర్జున్ కి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి.

ఇక రెండో టాస్క్ లో ఫ్లవర్స్ ఛాలెంజ్ లో పోటీపడిన వాళ్లలో కూడా అర్జున్ కే ఎక్కువ పాయింట్స్ వచ్చినా, అమర్ టాప్ ప్లేస్ లోకి వచ్చాడు. ఎందుకంటే ఈ టాస్క్ లో ఓడిపోయిన ఇద్దరు శివాజీ, శోభా తమ ఫ్లవర్స్ ని త్యాగం చేసి అమర్ కి ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి అమర్ కి బదులు యావర్ కి ఈ ఫ్లవర్స్ ఇవ్వాలని అనుకున్నాడు శివాజి. కానీ అమర్ వచ్చి తనని గెలిపిస్తానని మాట ఇచ్చాడని అన్నాడు. పైగా బిగ్ బాస్ ఇద్దరు కలిసి ఒక్క కంటెస్టెంట్ కే ఆ ఫ్లవర్స్ ని త్యాగం చేయాలని చెప్పాడు.

అక్కడి తో ఆగకుండా శోభా కూడా అమర్ కే ఇవ్వాలని ముందే డిసైడ్ అయింది. ఇటు శివాజీ శోభా ఎంత మొండిగా ఉంటుందో తెలుసు కాబట్టి, ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఇద్దరిదీ కలిపి అమర్ కి ఇచ్చేసారు. అందువల్ల అర్జున్ ని కూడా నెట్టేసి అమర్ టాప్ ప్లేస్ లోకి వచ్చేసాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు