Bigg Boss 7 : విన్నర్ కు జాక్ పాట్… ప్రైజ్ మనీతో పాటు ఇంకేం అందుకోబోతున్నాడంటే?

పాపులర్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈరోజు గ్రాండ్ గా జరగబోతోంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరన్న విషయం మరికొన్ని గంటల్లో స్పష్టం కాబోతోంది. కన్నుల పండుగ జరగబోతున్న ఫైనల్ ఎపిసోడ్ లో మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్, మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ తో పాటు బబుల్ గమ్ మూవీ టీం, డెవిల్ మూవీ టీం, సైంధవ్ చిత్ర బృందం, సీనియర్ యాంకర్ సుమ సందడి చేయబోతున్నారని సమాచారం. ఇక ఇప్పటికే విన్నర్ ఎవరన్న విషయం సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఆ పేరు వైరల్ అవుతుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ విన్నర్ కు ప్రైస్ మనీ ఇవ్వబోతున్నారు. మరి ప్రైజ్ మనీతో పాటు విన్నర్ కి తగలబోయే జాక్ పాట్ ఏంటి? అనే ఆసక్తికరమైన విషయంలోకి వెళ్తే…

బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. అమర్ దీప్ రన్నర్ తో సరిపెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మొదటి నుంచి విన్నర్ గా నిలుస్తాడని భావించిన శివాజీ మాత్రం థర్డ్ ప్లేస్ లో నిలిచి ఎలిమినేట్ అయ్యాడని చెప్పుకొస్తున్నారు. ఇక మరో ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ ఎలిమినేషన్ లో మాస్ మహారాజా రవితేజ పాలు పంచుకోబోతున్నాడని, మరో ఫైనల్ కంటెస్టెంట్ యావర్ కు మాత్రం 15 లక్షల సూట్ కేస్ ఇచ్చి ఫైనల్ రేసులో నుంచి పక్కకు తప్పించారని సమాచారం. ఇదిలా ఉండగా బిగ్ బాస్ విన్నర్ కు ఈసారి అందబోయే ప్రైస్ మనీ గురించే ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తోంది. గతంలో లాగా కాకుండా ఈ సీజన్లో విన్నర్ కు ప్రైస్ మనీ రూపంలో జాక్ పాట్ తగలబోతోందని సమాచారం. ఇంతకీ ఆ జాక్ పాట్ ఏంటి ? అంటే…

ఈసారి బిగ్ బాస్ విన్నర్ కు ప్రైస్ మనీతో పాటు బిగ్ సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయట. ఏకంగా విన్నర్ కోటి రూపాయల వరకు వెనకాల వేసుకోబోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ సర్ప్రైజ్ లు ఏమిటంటే… ఎప్పటిలాగే విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ బిగ్ బాస్ యాజమాన్యం అందివ్వబోతోంది. దాంతోపాటు ఈ బుల్లితెర సోకు స్పాన్సర్ గా వ్యవహరించిన జువెలరీ సంస్థ నుంచి 20 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ కూడా అందుకోబోతున్నాడట విన్నర్. అక్కడితో అయిపోలేదు సర్ప్రైజ్… వాటితో పాటు 12 లక్షల విలువైన మారుతీ బ్రీజా కారు కూడా విన్నర్ కు గిఫ్టుగా దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా అంతా కలుపుకుంటే బిగ్ బాస్ విన్నర్ ఖాతాలో 80 లక్షల వరకు ప్రైజ్ మనీ పడబోతోంది. ఇక ఈ విషయాలన్నీ కళ్ళారా ఎక్స్ క్లూజివ్ గా చూడాలంటే ఈరోజు సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా ఎదురు చూడక తప్పదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు