Bigg Boss 8 : బిగ్ లీక్… ఈవారం ఎలిమినేట్ అయ్యింది ఆ కంటెస్టెంటే?

Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఈసారి కొత్త కొత్త ట్విస్టులతో సరికొత్తగా సాగుతోంది. హౌస్ లో రోజుకో గొడవ జరుగుతుండడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. ఇక హౌస్ మేట్స్ గురించి ట్రోల్లింగ్, మీమ్స్ కూడా ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. అసలు హౌస్ లో వీళ్లంతా అడుగుపెట్టినప్పుడు ఎవర్రా మీరంతా అంటూ మొదలైన ట్రోలింగ్ హౌస్ మేట్స్ ఇస్తున్న కంటెంట్ తో మరింత ఎక్కువవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ డే రానే వచ్చింది. ఈ వీకెండ్ నాగార్జున హౌస్ నుంచి ఎవరిని బయటకు పంపబోతున్నారు అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. అయితే అంతలోనే ఎలిమినేషన్ కు సంబంధించిన లీక్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది.

ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి వారం నామినేషన్లలో శేఖర్ భాషా, విష్ణు ప్రియ, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి ఉన్నారు. అయితే నాగ మణికంఠ ఎలిమినేట్ అవుతాడని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన అనూహ్యంగా తన గత జీవితానికి సంబంధించిన స్టోరీని బయట పెట్టి ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అంటే బాగా ఎమోషనల్ అయి సింపతి కార్డ్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా మణికంఠకు ఫాలోయింగ్ పెరిగింది. భారీ సంఖ్యలో ఓటింగ్ రావడంతో ఆయన చివరి స్థానం నుంచి ఓటింగ్ లో టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు. దీంతో మణికంఠ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ వీక్ విష్ణు ప్రియ ఎలిమినేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం నడిచింది. కానీ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆమె ఫస్ట్ ప్లేస్ లో చాలా సేఫ్ గా ఉంది. ఇక శేఖర్ భాష కూడా మరీ క్రూయల్ గా ప్రవర్తించకుండా బాగానే ఆడుతున్నాడు. ఓటింగ్లో శేఖర్ కూడా లాస్ట్ ప్లేస్ లో ఉన్నప్పటికీ అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. మిగిలింది బెజవాడ బేబక్క , పృథ్వి, సోనియా. సీరియల్ బ్యాక్ గ్రౌండ్ కావడంతో పృథ్వి కూడా సేఫ్ గానే ఉన్నాడు. కానీ సోనియా, బేబక్క డేంజర్ జోన్ లో పడ్డారు. ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టుగానే బేబక్క హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

Who is Bezawada Bebakka Social Media Star who entered BBT8

- Advertisement -

బిగ్ లీక్స్ స్టార్ట్

సాధారణంగా బిగ్ బాస్ కు సంబంధించిన లీక్స్ ముందుగానే అందుతూ ఉంటాయి. గత సీజన్ల మాదిరిగా ఈ సీజన్లో కూడా ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం లీక్ అయ్యింది. బేబక్క ఎలిమినేట్ కాగా ఆమెకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. అయితే బేబక్కను ఈ వినాయక చవితి రోజునే బయటకు పంపిస్తారా? లేదంటే ఆదివారం వరకు ఎపిసోడ్ ను సాగదీస్తారా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు