Bigg Boss 8: ఇదెక్కడి ట్విస్ట్ మావా. మళ్లీ బలి వారేనా..?

Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8)మొదటి వారం పూర్తవగా, రెండవ వారం నామినేషన్ కి సంబంధించిన లిస్టు కూడా సిద్ధం అయిపోయింది. ఇక ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నవారు వీరే అంటూ నెటిజెన్స్ వార్తలు వైరల్ చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అసాధ్యం. సీజన్ 8 మొదలయ్యి ఇంకా రెండు వారాలు కూడా పూర్తి కాలేదు అప్పుడే చాలెంజింగ్ టాస్క్లతో చుక్కలు చూపిస్తున్నారు బిగ్ బాస్. మొదటి వారం హీటెక్కించిన నామినేషన్, రెండో వారం కూడా అదే స్థాయిలో జరిగిపోయింది. బెజవాడ బేబక్క (Bejawada Bebakka) ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పటిలాగే తెలుగు బిగ్ బాస్ లో ఆడవారికి అన్యాయం జరుగుతోందనే వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గత ఏడు సీజన్లను పరిశీలించినట్లయితే.. ఏడు సీజన్ లలో దాదాపు 5 మంది ఆడవారే మొదటివారం ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 8: Here comes the twist. Are they victims again?
Bigg Boss 8: Here comes the twist. Are they victims again?

ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న విష్ణు ప్రియ..

ఇక ఇప్పుడు రెండవ వారం కూడా ఎలిమినేట్ అయ్యేది ఆడవారే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈవారం ఎలిమినేషన్స్ లో భాగంగా మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా అనూహ్యంగా యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya)అగ్రస్థానంలో దూసుకుపోతోంది. దీనికి కారణం సోనియా (Sonia)అని చెప్పవచ్చు. నామినేషన్ సమయంలో విష్ణుప్రియను చాలా దారుణంగా ఆమె అవమానించింది.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. బట్టలు సరిగ్గా వేసుకోవు అంటూ అసభ్యకరంగా మాట్లాడి తన ఇమేజ్ను తగ్గించుకుంది సోనియా. దీంతో నెటిజెన్లు ఒక రేంజ్ లో సోనియా పై ఫైర్ అవుతున్నారు.

హద్దు మీరిన సోనియా..

దీనికి తోడు సోనియా హద్దుమీరి మాట్లాడుతుంటే.. విష్ణుప్రియ ఎమోషనల్ కాకుండా ధైర్యంగా ఆమె మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఓటింగ్ లో విష్ణు టాప్ లో దూసుకుపోతూ ఉండగా ఆ తర్వాత నిఖిల్ రెండవ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి మధ్య తేడా కూడా పెద్దగా లేదని చెప్పవచ్చు. విష్ణు ప్రియ 26% ఓటింగ్, నిఖిల్ 24% ఓటింగ్ తో దూసుకుపోతున్నారు. వీరిద్దరి తర్వాత నాగమణికంఠ మూడో స్థానంలో ఉండగా , నైనిక నాలుగవ స్థానంలో నిలిచింది. శేఖర్ భాష ఐదవ స్థానం , ఆదిత్య ఓం ఆరో స్థానంలో ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా కేవలం ఒక పర్సెంట్ మాత్రమే ఓటింగ్ తేడా ఉంది. చివరి స్థానంలో పృథ్వి, సీత అన్నారు. వీరిద్దరికీ కూడా తక్కువ ఓటింగ్ వస్తూ ఉండటంతో ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

- Advertisement -

మళ్లీ ఆడవారే బలి కాబోతున్నారా..?

అయితే ఈవారం సీత ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఆమె పిఆర్ టీం అనే వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే సీత నామినేషన్ లోకి వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించిన పోస్టింగ్స్ ఏవి కూడా కనిపించలేదు. పృథ్వి కంటే కూడా సీతా స్ట్రాంగ్ కంటెస్టెంట్. అయినా సరే ఆమెకు సంబంధించిన ప్రమోషన్స్ ఎక్కడా లేకపోవడం ఆమెకు నెగిటివ్ గా మారింది . ఇక శుక్రవారం వరకు వచ్చే ఓటింగ్ బట్టి ఎలిమినేషన్ పై స్పష్టత వస్తుంది. మరి ఒకవేళ ఈసారి కూడా సీత ఎలిమినేట్ అయితే ఆడవారికి బిగ్ బాస్ హౌస్ లో అన్యాయం జరుగుతోంది అని చెప్పడానికి ఇది పక్కా నిదర్శనం అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు