Bigg Boss 8 : హాట్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ… సీరియల్ బ్యాచ్ కు టఫ్ పోటీ తప్పదా?

Bigg Boss 8 : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై అప్పుడే వారం పూర్తయ్యింది. ఈ సీజన్లో నాగార్జున చెప్పినట్టుగానే హౌజ్ మేట్స్ మధ్య గొడవలు అన్ లిమిటెడ్ గా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ సంగతి దేవుడెరుగు కానీ గొడవలతోనే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కంటెస్టెంట్స్. అయితే ఎప్పటిలా కాకుండా షో కాస్త కొత్తగానే ఉంది. ఈ సీజన్ లో ఫస్ట్ వీకే ఓ కంటెస్టెంట్ నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో ఓ హాట్ బ్యూటీ అడుగు పెట్టబోతోంది అనే టాక్ నడుస్తోంది. మరి ఆ అమ్మాయి ఎవరు? అనే విషయంలోకి వెళ్తే….

బో*ల్డ్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ

బిగ్ బాస్ కు సంబంధించి ఇప్పటిదాకా ప్రసారమైన ప్రతి సీజన్లోనూ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది హాట్ టాపిక్కే. కానీ ఆ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ సడన్ గా ఎలా వస్తారో అంతే ఫాస్ట్ గా బయటకు వెళ్లిపోతారు కూడా. ఈ సీజన్లో కూడా ఓ బో*ల్డ్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు బుల్లితెర హాట్ బాంబ్ జ్యోతి రాయ్. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి, ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఆమె సినిమాల కోసం ఊహించని రేంజ్ లో హాట్ షో చేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. అలాగే ఓ యంగ్ డైరెక్టర్ ను రెండవ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో ముందుగానే ఆమెను బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా తీసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె షూటింగ్ లతో బిజీగా ఉండడం వల్ల ఆ టైంలో వెళ్లలేదని జ్యోతి స్వయంగా వెల్లడించింది. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆమెను హౌజ్ లోకి పంపుతున్నారని ప్రచారం జోరందుకుంది. కానీ ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Jyothi Rai: No More Secret.. Hot Beauty Jyothi Rais Real Age Will Shock  You! | Jyothi Rai: 'ನೋ ಮೋರ್ ಸೀಕ್ರೆಟ್'.. ಹಾಟ್‌ ಬ್ಯೂಟಿ ಜ್ಯೋತಿ ರೈ ನಿಜ ವಯಸ್ಸು  ಕೇಳಿದ್ರೆ ಶಾಕ್‌ ಆಗೋದು ಫಿಕ್ಸ್‌! News in

- Advertisement -

సీరియల్ బ్యాచ్ కు టఫ్ పోటీ ?

అయితే ఇప్పటికే బిగ్ బాస్ 8లో ఏకంగా నలుగురు సీరియల్ బ్యాచ్ ఉన్నారు. యష్మి గౌడ, ప్రేరణ కంబం, నిఖిల్, పృథ్వీ నలుగురూ సీరియల్ బ్యాక్గ్రౌండ్ తో ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినవారే. అయితే తాజాగా మరో సీరియల్ నటి వైల్డ్ కార్డు ఎంట్రీ, అది కూడా జ్యోతి రాయ్ హౌజ్ లోకి అడుగు పెట్టడం అంటే ఖచ్చితంగా ఈ నలుగురికి పోటీ టఫ్ గానే ఉంటుంది. జ్యోతికి ఉన్న ఫాలోయింగ్ హౌజ్ లో ఉన్న ఈ నలుగురి కంటే ఎక్కువే. మరి అలాంటప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగానే జ్యోతి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తే, ఆమెతో పోటీని ఈ సీరియల్ బ్యాచ్ ఎలా తట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు