Bigg Boss 8 Promo : మొదలైన సెకండ్ వీక్ నామినేషన్ హీట్… మళ్ళీ సోనియానే టార్గెట్

Bigg Boss 8 Promo : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 8కు సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో ఎప్పటిలాగే హౌజ్ మేట్స్ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరూ ఒక్కో రీజన్ చెబుతూ హౌజ్ మేట్స్ ను నామినేట్ చెయ్యడమే కాకుండా, మొత్తానికి మాస్క్ తీస్తున్నారు అన్పించారు. మరి తాజా ప్రోమోలో బిగ్ బాస్ మేకర్స్ చూపించిన ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

సెకండ్ వీక్ నామినేషన్స్ లో రచ్చ

మొదటి వారం నామినేషన్స్ లో ఊహించినట్టుగానే బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు సెకండ్ వీక్ నామినేషన్స్ మొదలు కాగా, ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య ఈ నామినేషన్ హీట్ పుట్టించినట్టుగా చూపించారు. హౌజ్ లో ఉన్న సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ఇద్దరు సభ్యులను నామినేట్ చెయ్యాలని, వారిపై పెయింట్ పోసి రీజన్ చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. అందులో అభయ్ ఆదిత్యను, సీత ప్రేరణను, సోనియా నైనికను నామినేట్ చేసినట్టుగా ప్రోమోలో చూపించారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొంతమంది హౌజ్ మేట్స్ పక్కనే కూర్చున్నారు. అంటే ఫస్ట్ వీక్ లాగే వాళ్లకు ఏదైనా ఇమ్యూనిటీ లభించిందా ? అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇందులో నామినేషన్స్ కోసం వాడిన కలర్స్ కు అర్థం ఏంటో చూడాలి.

Bigg Boss 8 : బిగ్ బాస్‌లో రంగు పడింది.. అప్పుడే రెండో వారం నామినేషన్లు  మొదలు.. | Bigg boss 8 second week nominations started monday episode promo  released-10TV Telugu

- Advertisement -

ప్రేరణ, సోనియా మధ్య మాటల యుద్ధం

ఈ నేపథ్యంలోనే కిరాక్ సీత మాట్లాడుతూ బయట ఫ్రెండ్ షిప్ పెట్టుకుని వచ్చి, వాళ్ళను ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు. కానీ మీరు ఫాలో అవ్వండి అని వేరే వాళ్లకు చెప్పే రైట్ మీకు లేదు అని చెప్పడంతో ప్రేరణ ఫైర్ అయ్యింది. బయట నుంచి అనే మాట స్టార్టింగ్ నుంచి వస్తోంది. అది కొంచం ఆపేయండి అంటూ సీతకు ఇచ్చిపడేసింది ప్రేరణ. అయితే అంతలోనే నేను క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యట్లేదు, రాంగ్ వర్డ్స్ వాడొద్దు అంటూ సీత సమాధానం చెప్పింది. ప్రోమోలో వీరిద్దరి గొడవ హైలెట్ అయ్యింది. అలాగే సోనియా, ప్రేరణ… సోనియా, నైనికా మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఆదిత్య హౌజ్ లో ఎక్కడా కన్పించట్లేదు అని చెప్పడమే ఆయనకు మైనస్ అయ్యింది. అదే కారణాన్ని సాకుగా చూపుతూ అభయ్ ఆదిత్యను నామినేట్ చెయ్యడం ప్రోమోలో కన్పించింది. దీంతో ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే ఆదిత్య కూడా ఈసారి కాస్త ఫైర్ అయ్యారు. అభయ్ ఆదిత్యను నామినేట్ చేస్తూ ఏం రీజన్ చెప్పాడో తెలీదు కానీ నా ఇన్వాల్వ్ మెంట్ మణికంఠ కంటే తక్కువగా ఉందా ? అంటూ ప్రశ్నించాడు ఆదిత్య. మొత్తానికి ఈ నామినేషన్స్ లో మరోసారి డస్ట్ బిన్ గొడవ కూడా హాట్ టాపిక్ అయ్యింది. మరి ఎవరెవరు ఈ వీక్ నామినేట్ అయ్యారు ? ఎందుకు నామినేట్ అయ్యారు ? అనే విషయం తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు