Bigg Boss 8 Telugu: మణికంఠకు ఊరట.. డేంజర్ జోన్ లో ఆమె..!

Bigg Boss 8 Telugu.. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నాలుగు రోజులైంది. అప్పుడే ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు మొదటి వారం నామినేషన్ లో భాగంగా ఒకరికొకరు విమర్శించుకుంటూ నామినేట్ చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వారం జరిగిన నామినేషన్స్ చాలా విభిన్నంగా కూడా జరిగాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. అలా నామినేట్ అయిన ఇద్దరిలో ఒకరిని హౌస్ చీఫ్ గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు. అందులో భాగంగానే ఈవారం హౌస్ లో నామినేషన్స్ చాలా రసవత్తరంగా సాగాయి. విష్ణు ప్రియ, సోనియా, నాగమణికంఠ, పృథ్వి శెట్టి, శేఖర్ బాషా , బెజవాడ బేబక్క, ఈ ఆరుగురు కూడా నామినేషన్ లోకి వచ్చేసారు. ఇక అందరూ కూడా నాగ మణికంఠ ఎలిమినేట్ అవుతారని అనుకుంటూ ఉండగా, తాజాగా ఇతడిని ఆడియన్స్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది.

Bigg Boss 8 Telugu: Relief for Manikantha.. She is in the danger zone..!
Bigg Boss 8 Telugu: Relief for Manikantha.. She is in the danger zone..!

నామినేషన్ లో ఆరుగురు..

మొత్తం ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. చీఫ్ గా ఉన్న నిఖిల్, నైనిక, యష్మి ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. ఇక మొదటివారం జరిగిన నామినేషన్ లో కొంతమంది సిల్లీ రీసన్స్ చెబితే, మరి కొంతమంది వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు. ముఖ్యంగా శేఖర్ భాష లేజీగా ఉంటున్నాడు అంటూ విష్ణు ప్రియ అతడిని నామినేట్ చేసింది. నిజంగానే అతను అసలు యాక్టివ్ గా ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు. ఏదో వాదిస్తున్నాడు తప్ప అతడు పెద్దగా పనిచేసినట్లు కనిపించడం లేదు. ఆ తర్వాత వంటగది విషయంలో బేబక్కను నామినేట్ చేశారు . కుక్కర్ రీసన్ చెప్పి ఒకరు, కూర రీజన్ చెప్పి ఇంకొకరు ఆమెను నామినేట్ చేయడం జరిగింది. ఇక నాగ మణికంఠ గురించి చెప్పాల్సిన పనిలేదు. హౌస్ లో ఉన్న చాలామంది ఇతడి గురించి నెగిటివ్ కామెంట్స్ చెబుతూ నామినేట్ చేశారు. ముఖ్యంగా ఎవరితోనూ పెద్దగా కలవడం లేదని, ఒంటరిగా ఉంటున్నాడని , కాస్త పొగరుగా సమాధానం చెబుతున్నాడని, రెస్పెక్ట్ ఇవ్వడంలేదని, రాజకీయం చేస్తున్నాడని దీనికి తోడు సెంటిమెంట్ , ఏడుపు ఇలా అస్త్రాలు వాడుతున్నాడు అంటూ ఒకరి తరువాత ఒకరు నామినేట్ చేశారు.

సెంటిమెంట్ పేరిట నాగ మణికంఠ సేవ్ అవుతాడా..

ఇక పృథ్వీ నీ కూడా నామినేట్ చేశారు. సోనియాని ఆమె దాటికి తట్టుకోలేక నామినేట్ చేశారు. నిజానికి సోనియా చాలా కరెక్ట్ గా, గట్టిగా మాట్లాడుతోంది. అందుకే ఈమెను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది .ఇకపోతే ఈవారం నామినేట్ అయిన వారిలో తక్కువ ఓట్లు బెజవాడ బేబక్క కు పడ్డాయని తెలుస్తోంది. అందరూ కూడా నాగమణికంఠ ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు. కానీ ఆయన సెంటిమెంట్ వర్క్ అవుట్ అవడంతో ఆయనను సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -

ఎలిమినేషన్ కి దగ్గరగా బెజవాడ బేబక్క..

ఇక డేంజర్ జోన్ లో ఉన్నది పృథ్వి, బెజవాడ బేబక్క మాత్రమే. కానీ ఇద్దరితో పోల్చుకుంటే బెజవాడ బేబక్కకి ఓటు శాతం తగ్గింది. సో ఈవారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు