Bigg Boss: బేబక్క అవుట్.. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..?

Bigg Boss: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో అప్పుడే తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్లో మొదటివారం కూడా పూర్తి చేసుకుంది. మొత్తం హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా చాలామంది కన్నడ బ్యాచ్ వచ్చారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు అసలు పెద్దగా గుర్తింపు లేని సెలబ్రిటీస్ ని హౌస్ లోకి తీసుకురావడం మరొక ఎత్తు. ముఖ్యంగా ఒక నలుగురు, 5 మందికి మించి పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి.

Bigg Boss: Bebakka out.. how much remuneration was given..?
Bigg Boss: Bebakka out.. how much remuneration was given..?

నామినేషన్ అయినా 6 మంది కంటెస్టెంట్ వీరే..

మొదటి రోజు నుంచి విమర్శలు, గొడవలు, ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఏడుపు, సంతోషం అన్నీ కూడా ఒక వారంలోనే అన్ని చూపించేశారు కంటెస్టెంట్. టైటిల్ విన్నర్ కోసం అలాగే ప్రేక్షకులలో అటెన్షన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇకపోతే హౌస్ లోకి అడుగుపెట్టిన రెండు రోజులకే నామినేషన్స్ మొదలయ్యాయి. మొదటి వారం నామినేషన్స్ లో భాగంగా 6 మంది నామినేట్ అయ్యారు. వారిలో శేఖర్ భాష, నాగ మణికంఠ, బెజవాడ బేబక్క , విష్ణు ప్రియ, సోనియా, పృథ్వీరాజ్ మొదటి వారం నామినేషన్ లో భాగంగా నామినేట్ అయ్యారు.

ఓటింగ్లో చివరి స్థానం ఆమే..

ఇక మొదటివారం పూర్తయిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు కూడా జరిగాయి. సోషల్ మీడియా ఫలితాల ప్రకారం మొదటి స్థానంలో సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ తెచ్చుకొని అటు బుల్లితెర ఇటు వెండితెర పైన కూడా అలరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విష్ణు ప్రియ మొదటి స్థానంలో నిలవగా, సెంటిమెంట్ ప్లే చేసి అందరి దృష్టిని ఆకర్షించిన నాగమణికంఠ రెండవ స్థానంలో నిలిచారు. ఇక మూడవ స్థానంలో సీరియల్ నటుడు పృధ్వీరాజ్ నిలువగా, మిగతా స్థానాలలో ఆయా కంటెస్టెంట్లు నిలిచినట్లు తెలుస్తోంది. అయితే చివరి స్థానంలో బేబక్క నిలువగా ఆమె ఇప్పుడు ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

- Advertisement -

ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్క.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో ఎవరైతే కాస్త ఏజ్డ్ గా కనిపిస్తున్నారో వారిని తొలి వారంలోని ఎలిమినేట్ చేశారనే వార్త ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అనవాయతీ ప్రకారమే బేబక్కను మొదటి వారంలో ఎలిమినేట్ చేశారనే ప్రచారం చేశారు. అది కాకుండా ఆమె మొదటి వారం ఎక్కువగా వంటగది లో ఉండడం కారణంగా మిగతా కంటెస్టెంట్లతో ఎక్కువగా కలవలేకపోయింది. అలాగే వంటగది నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో ఈవారం బేబక్క గా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బేబక్క బిగ్ బాస్ బజ్ లో కూడా పాల్గొన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బెజవాడ బేబక్క రెమ్యూనరేషన్..

ఇకపోతే హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె నిఖిల్ పై మాత్రమే చిన్న కామెంట్స్ చేసి సైలెంట్ గా బయటకు వచ్చిందని సమాచారం. అంతేకాదు ఈమె ఆ తర్వాత బెజవాడకు వెళ్లి అట్నుంచి అమెరికా వెళ్ళిపోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఎంత పారితోషకం తీసుకుంది అనే విషయాన్నికొస్తే రోజుకు రూ.21,428 చొప్పున మొత్తం వారానికి రూ.1,49,996 వచ్చినట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు