Bigg Boss: సోనియా పై నెటిజన్స్ ఫైర్.. నోరా.. డ్రైనేజా అంటూ..!

Bigg Boss.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న షో బిగ్ బాస్ (Biggboss). ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ రెండవ వారం కొనసాగుతోంది. ఇక ఇందులో భాగంగా ఎవరికి వారు తమదైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండో వారం లో భాగంగా నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికీ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ రెచ్చిపోతూ నామినేట్ చేస్తున్నారు. ఈసారి మాటలు చాలా శ్రుతి మించాయి. ముఖ్యంగా విష్ణు ప్రియ (Vishnu Priya)గురించి మాట్లాడుతూ.. సోనియా (Sonia )వాడిన పదజాలం సరిగ్గా లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.

Bigg Boss: Netizens fire on Sonia.. mouth or r Drainage?
Bigg Boss: Netizens fire on Sonia.. mouth or r Drainage?

విష్ణు ప్రియ పై విరుచుకుపడ్డ సోనియా..

అసలు విషయంలోకి వెళ్తే.. రెండవ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా విష్ణు ప్రియ ఇద్దరిని ఎంచుకుంది. మొదట నాగ మణికంఠ ను నామినేట్ చేసిన ఈమె, ఆ తర్వాత సోనియాను ఎంచుకుంది. ఇక్కడే వీరిద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. నిజం చెప్పాలంటే హౌస్ లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది అని చెప్పవచ్చు. సోనియా చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని నెటిజన్లు కూడా చెబుతున్నారు. ఆట గురించి మాట్లాడకుండా పర్సనల్ ఎటాక్ దిగిందంటూ సోనియా పై మండిపడడమే కాదు అది నోరా లేక డ్రైనేజీనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతకూ సోనియా, విష్ణు ప్రియ ను ఏమన్నది అనే విషయం చూద్దాం.

సోనియాను ఎలిమినేట్ చేయాలనుకున్న నెటిజన్స్..

విష్ణు ప్రియ ను ఉద్దేశిస్తూ సోనియా.. నువ్వు ముందు బట్టలు సరిగా వేసుకోవు. ఇక అలాంటి దుస్తులతోనే వెళ్లి ఇతరుల పక్కన నిల్చుంటావు. నీవల్ల పక్క వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నా కూడా నువ్వు పట్టించుకోవు. నీ మాటలు, నీ చేతులకు చాలా తేడాలు ఉన్నాయి. అసలు నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్వు ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు కానీ నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్ జోక్స్ వేయడానికి బిగ్ బాస్ షో కి పంపించారేమో అనుకుంటాను. నన్ను మాత్రం అలాంటి వాటి కోసం ఇక్కడికి పిలవలేదు. గతంలో కూడా అడల్ట్ కామెడీ షో లో ఉన్నావు కదా అందుకే ఇప్పుడు నిన్ను బిగ్ బాస్ కి పిలిచారు అంటూ చాలా దారుణంగా సోనియా కామెంట్ చేసింది. మొత్తానికి అయితే వర్మ బ్యూటీ చేసిన ఈ కామెంట్లకు అభిమానులే కాదు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు హోస్ట్ నాగార్జున కూడా సోనియా కామెంట్స్ పై గట్టిగా హెచ్చరించాలని చెబుతున్నారు. మరికొంతమంది ఏకంగా సోనియాను ఎలిమినేట్ చేయాలి.. ఇలాంటి డ్రైనేజ్ హౌస్ లో వద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ఈవారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే..

ఇకపోతే రెండవ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన కుటుంబ సభ్యుల విషయానికొస్తే.. నిఖిల్, నైనిక, సీత, మణికంఠ , శేఖర్ బాషా , ఆదిత్య , విష్ణు ప్రియ, పృథ్వీ ఇలా వీరంతా కూడా నామినేట్ అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు