Biggboss8 : హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన “అభయ్ నవీన్”.. అందరికంటే ఎక్కువ పేరు ఇతనికే!

Biggboss8 : టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది. స్టార్ మా లో ఏడేళ్లగా బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో 8వ సీజన్ ఫైనల్ గా ప్రారంభమైంది. గత నెల రోజులుగా పలు రకాల ప్రోమోలతో నాగార్జున (Nagarjuna) సందడి చేయగా, సెప్టెంబర్ 1నుండి బిగ్ బాస్ స్ట్రీమింగ్ అవుతుందంటూ చెప్పేసారు. ఫైనల్ నిన్న రాత్రి నుండే సీజన్ 8 టెలికాస్ట్ అవుతుండగా, ఫస్ట్ ఎపిసోడ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ వివాదం జరిగింది. ఇందులో ఎక్కువగా సీరియల్ నటీనటులే ఉండగా, సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లు కూడా ఎంట్రీ ఇచ్చారు.

Actor Abhay Naveen entered Bigg Boss season 8

ఇక బిగ్ బాస్ (Bigg Boss 8) హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని గమనిస్తే… సీరియల్ నటి యష్మి గౌడ, నటుడు నిఖిల్ మలియక్కల్, నటుడు ఆదిత్య ఓం, నటి సోనియా ఆకుల, ఇన్ఫ్లుయెన్సుర్ బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, నటి కిరాక్ సీత, నటుడు నాగ మణికంఠ, నటుడు పృథ్వీరాజ్ శెట్టి, యాంకర్ విష్ణుప్రియ, డ్యాన్సర్ నైనిక , యూట్యుబర్ నబిల్ ఆఫ్రిది, నటి ప్రేరణ ఎంట్రీ ఇవ్వగా, నటుడు అభయ్ నవీన్ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు.

- Advertisement -

హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన “అభయ్ నవీన్”..

ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8 లోకి మూడవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు నటుడు అభయ్ నవీన్ (Abhay Naveen). అభయ్ నవీన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. “పెళ్లి చూపులు” (Pelli choopulu) సినిమాతో పాపులర్ అయిన అభయ్ నవీన్ పలు సినిమాల్లో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఇక బిగ్ బాస్ లోకి ఇతని ఎంట్రీ కూడా స్పెషల్ గా జరిగింది. నాగార్జున అభయ్ కి తెలియకుండా అతని భార్య వీడియో మెసెజ్ తో హౌస్ లోకి స్వాగతం పలికారు నాగ్. ఇక అభయ్ నవీన్ బొమ్మల రామారం సినిమాతో సినిమాల్లోకి పరిచయం అయ్యాడు. రీసెంట్ గా ‘రామన్న యూత్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి అభయ్ నవీన్ దర్శకత్వం కూడా వహించగా, అభయ్ నటించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే అందరికి పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ గానే ఎక్కువ సుపరిచితుడు అయ్యాడు. ఇక ఆ తర్వాత గీతా గోవిందం, సాహో, డిస్కో రాజా, రీసెంట్ గా రాక్షస కావ్యం వంటి సినిమాల్లో నటించాడు.

ఎక్కువ ఫేమ్ అభయ్ కే..

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 (Biggboss8) లోకి అడుగుపెట్టిన అభయ్ నవీన్ అందరికంటే ఎక్కువ ఫేమ్ తో అడుగుపెట్టాడని చెప్పాలి. ఎందుకంటే సీరియల్ నటులు, ఎక్కువగా జనాలకి తెలిసినా, సినిమాలతో ఎక్కువగా అభయ్ ఫేమస్ అయ్యాడు. ఇక ఈ ఇయర్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా అభయ్ నవీన్ డిజిటల్ లో ఎంతో ప్రచారం చేసాడు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ అభయ్ కి బోనస్ గా లభిస్తుందని చెప్పాలి. ఓవరాల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ మంది ప్రేక్షకులకు అభయ్ నవీన్ సుపరిచితం అని చెప్పాలి. మరి అభయ్ నవీన్ తన ఆట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు