Adhi Reddy: బిగ్ బాస్ ట్రాప్ లో ఇరుక్కోవద్దు.. అక్కడ జరిగే బాగోతాలు ఇవే అంటూ..!

Adhi Reddy.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకోగా.. త్వరలోనే 8వ సీజన్ కి సిద్ధమైంది..ఇటీవల ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు.. అన్లిమిటెడ్ వరాలు ఇస్తామంటూ జీని రూపంలో హోస్ట్ నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. దీంతో ఈసారి షో కూడా మరింత రసవత్తరంగా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో బిగ్ బాస్ సెట్ వర్క్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ఎంపికపై కూడా కసరత్తు జరుగుతోంది.

Adhi Reddy: Don't get stuck in the Bigg Boss trap.. these are the good things that happen there..!
Adhi Reddy: Don’t get stuck in the Bigg Boss trap.. these are the good things that happen there..!

బిగ్ బాస్ ఉచ్చులో పడకండి అంటూ హెచ్చరిస్తున్న ఆదిరెడ్డి..

ఇదిలా ఉండగా బిగ్ బాస్ పేరిట గతంలో ఎన్నో మోసాలు వెలుగు చూసాయి. హౌస్ లోకి పంపిస్తామని ఎవరెవరికో డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ , రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అందరిలో అనుమానాలు కలిగేలా చేస్తుంది. అంతేకాదు ఎవరూ కూడా బిగ్ బాస్ అనే ట్రాప్ లో పడొద్దు అంటూ అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఆదిరెడ్డి పంచుకున్న ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ పేరిట జరిగే మోసాలివే

గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ షో లపై రివ్యూలు , విశ్లేషణ అందిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నాడు. అప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 వీడియోలు చేయడం కూడా మొదలుపెట్టాడు..అందులో భాగంగానే బిగ్ బాస్ పేరిట బయట జరుగుతున్న మోసాల గురించి కూడా అందరిని అలర్ట్ చేస్తూ ఒక వీడియోని రూపొందించి సోషల్ మీడియాలో పంచుకున్నారు . ప్రస్తుతం ఆదిరెడ్డి షేర్ చేసిన ఈ వీడియో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలనుకున్న చాలామందికి ఒక అవగాహన కలిగించింది అని చెప్పవచ్చు.

- Advertisement -

బిగ్ బాస్ అసలు ప్రాసెస్ ఇదే..

ఇకపోతే ఆదిరెడ్డి తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ లోకి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను, అలాగే సెలక్షన్ ప్రాసెస్ , రెమ్యునరేషన్ ఇలా అన్ని విషయాలను కూడా పంచుకున్నారు. ఈయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా తనకు రూ.30 లక్షల వరకు పారితోషకం అందిందని తెలిపాడు. బిగ్ బాస్ కి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి మీకు బిగ్ బాస్ కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను.. ఆ తర్వాత అధికారిక వెబ్సైట్ నుండి మెయిల్ పంపి కొన్ని వివరాలు అడిగారు. ఆ తర్వాత జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. రెమ్యూనరేషన్ వివరాలు చర్చించారు. హెల్త్ చెకప్స్ ఆ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ అన్నీ కూడా జరిగాయి. ఏ వీలు, డాన్స్ షోస్ అన్నీ కూడా చూసిన తర్వాతనే హౌస్ లోకి పంపిస్తారు.

రికమండేషన్ లు పనికిరావు..

ముఖ్యంగా ప్రముఖుల సిఫారసులు, రికమండేషన్లు ఇక్కడ పనికిరావు. ఎవరైనా మిమ్మల్ని బిగ్ బాస్ లోకి పంపిస్తాము డబ్బులు ఇవ్వండి అని అడిగితే మాత్రం ఆ ట్రాప్ లో మీరు పడకండి. ముఖ్యంగా ఆఫర్ ఇచ్చేవాళ్ళు అయితే వాళ్లే కాల్ చేసి అధికారిక మెయిల్ ఐడి నుంచి మెయిల్ చేస్తారు. దయచేసి బిగ్ బాస్ అనే పేరిట ఉచ్చులో ఇరుక్కోకండి అంటూ హెచ్చరించారు. ముఖ్యంగా 39:52 నిమిషాల నిడివి ఉన్న లెంగ్తీ వీడియోని ఆదిరెడ్డి అభిమానులతో పంచుకున్నారు ఆదిరెడ్డి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు