BiggBoss 8 : ఆదిత్య ఓం కి నాగ్ అంత ఓపెన్ గా చెప్పినా అర్థమవ్వలేదా పాపం?

Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో స్టార్ మా లో మెల్లిగా ఊపందుకుంటుంది. తొలివారం లో కంటెస్టెంట్స్ లో ఎక్కువ మంది ఆడియన్స్ కి పరిచయం లేరు కాబట్టి, కనెక్ట్ కావడానికి టైం పట్టింది. అయితే నామినేషన్స్ టైం నుండే ఇంట్రెస్ట్ మొదలైంది. ఇక తొలివారం ఈ కంటెస్టెంట్స్ లో శేఖర్ భాషా, విష్ణు ప్రియ, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వి రాజ్ శెట్టి నామినేట్ అయ్యారు. కాగా అనూహ్యంగా తొలి ఎలిమినేషన్ గా బేబక్క (Bebakka) ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఎలిమినేషన్ డే రోజున నాగార్జున మంచి ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేయగా, హౌస్ లో ఒక్కొక్కరికి క్లాస్ పీకాడు. కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ ని వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో స్మూత్ గా చెప్పాడు.

Aditya Om underperformed in BiggBoss 8 house

పెర్ఫార్మన్స్ లో చల్లబడ్డ ఆదిత్య ఓం..

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో హీరోగా, డైరెక్టర్ గా రాణిస్తూ, కొన్నాళ్లుగా ఫామ్ లో లేక ఫేడ్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మళ్ళీ జనాలకు దగ్గరవ్వాలని హౌస్ లోకి వచ్చాడు. అయితే ఎంట్రీ ఇచ్చిన రోజు నుండే ఆదిత్య ఓం (Aditya om) అందర్నీ పలకరిస్తూ అట్రాక్ట్ చేసాడు. హౌస్ లో ఎవరితోనూ పెద్దగా వాగ్వాదానికి దిగకుండా, ఫ్రెండ్లీ గా ఉంటూ, న్యూట్రల్ గా ఉంటున్నాడు. అయితే ఆదిత్య ఓం ఆటల్లో పెర్ఫార్మన్స్ చుపిస్తున్నప్పటికీ ఎనర్జీ మాత్రం మిస్ అవుతుందని చెప్పాలి. కొన్ని విషయాలని లైట్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా నామినేషన్స్ లో కూడా ఎక్కువగా ఫైర్ కనిపించలేదు. ఈ విషయాన్నే నాగ్ గుర్తు చేసాడు.

- Advertisement -

నాగ్ చెప్పినా అర్ధం కాలేదు..

అయితే ఎలిమినేషన్ డే రోజున నాగార్జున (Nagarjuna) అందరికి తనదైన శైలిలో కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాడు నాగ్. అయితే ఆదిత్య ఓం హౌస్ లో యాక్టీవ్ గా లేడన్న విషయాన్నీ గుర్తు చేస్తూ, నాగార్జున రూమ్ లోకి వెళ్లి ఎదో తీసుకురమ్మంటాడు. అయితే నాగ్ మాట్లాడుతూ, నిన్నే ఎందుకు పంపాను తెలుసా అంటాడు.. తెలీదు సార్ అని ఆదిత్య అంటే… ఇప్పుడైనా మాకు కనబడతావని అంటూ పంచ్ వేస్తాడు. అయితే ఆదిత్య ఓం కి అర్థం కాక కామెడీ అనుకుని నవ్వేస్తాడు. కాసేపటికి శేఖర్ బాషా అర్ధమయేట్టు చెప్తాడు. హౌస్ లో ఇకనైనా యాక్టీవ్ గా ఉండమని నాగార్జున ఆదిత్య ఓం కి ఇలా చెప్పాడు. ఇక ఆదిత్య ఓం నార్త్ నుండి రావడంతో తెలుగు అంతగా రాదు. అయితే ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీ లో ఉండడం వల్ల కాస్త బాగా మాట్లాడగలడు, కానీ కొన్ని విషయాలు వెంటనే అర్ధం చేసుకోలేడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇకనైనా నామినేషన్స్ టైం లో పాయింట్స్ ని బాగా అర్ధం చేసుకుని డిఫెండ్ చేసుకుంటే మంచిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు