Biggboss season7: నాగ్ ముందే మళ్ళీ జోకర్ అయిన అమర్!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం మొదటి ఎలిమినేషన్ గా అశ్విని శ్రీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం రోజు రెండో ఎలిమినేషన్ కూడా జరుగనుంది. అయితే ఈ శనివారం హౌస్ మేట్స్ చేసిన తప్పులతో, పనిష్మెంట్లతో స్టార్ట్ చేసిన నాగార్జున, ఆదివారం సరదా టాస్కులతో ఎలిమినేషన్ డే ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో ఒకటి స్పై టీమ్ గా, ఇంకోటి స్పా టీమ్ గా నాగార్జున డిసైడ్ చేసారు, ఆ టీమ్స్ లో ఎవరుంటారో తెలిసిందే గా.

ఇక ఈ రెండు టీమ్ ల మధ్య జరిగిన టాస్క్ లలో ఎక్కువగా స్పై టీమ్ నుండి ఆన్సర్స్ రాగా, ఆ టీమ్ లో రతిక యాక్టీవ్ గా గేమ్స్ ఆడింది. ఇదిలా ఉండగా స్పా టీమ్ లో ఉన్న అమర్ దీప్ ఈ సారి నాగార్జున ముందే జోకర్ అయ్యాడు. అయితే ఇంతకు ముందులాగా సీరియస్ గా కాకున్నా, ఫన్నీ గానే గేమ్స్ లో బఫున్ అయ్యాడు.

నాగార్జున టాస్క్ లో భాగంగా ఫొటోస్ చూపిస్తే ఆ ఫోటోలని బట్టి, హౌస్ మేట్స్, వాటికీ సంబంధించిన పాటని పాడాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో నాగార్జున న్యూటన్ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో ని చూసి అమర్ దీప్ శివుడి ఫోటో అని చెప్పాడు. నాగ్ తో పాటు కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రియాంక, గౌతమ్ అయితే మామూలుగా నవ్వలేదు. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ముందు అమర్ వల్ల ఆడియన్స్ ఫుల్ గా ఎంటర్టైన్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు