Biggboss season7: రతిక ని ‘SPY’ టీమ్ లోకి తోసేసిన అశ్విని!

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం అశ్విని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ బయటికి వచ్చేసిన కంటెస్టెంట్ తో లోపల ఉన్న హౌస్ మేట్స్ ని ఓ సారి మాట్లాడిస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలాంటి గేమ్ ఆడతారో, వాళ్ళ గురించి ఒక్క మాటలో అశ్విని ని చెప్పమని నాగ్ అన్నాడు.

ఇక ఒక్కొక్కరి గురించి చెప్తూనే ఈ హౌస్ లో కంటెస్టెంట్స్ గ్రూప్ లుగా బాగా విడిపోయారని అశ్విని చెప్పింది. మొదటగా స్టార్ మా బ్యాచ్ లో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక ఒక గ్రూప్ గా రన్ అవుతున్నారని చెప్పింది. ఆ తర్వాత spy టీమ్ గా పాపులర్ అయిన శివాజీ, ప్రశాంత్, యావర్ ల గురించి చెప్తూ, వాళ్లలోనే రతిక కూడా ఒక గ్రూప్ మెంబెర్ గా కలిసిపోయిందని చెప్పింది. అయితే ప్రశాంత్ కి రతిక కి అస్సలు పడదని తెలిసిందే. అలాంటిది ఆ గ్రూప్ లో ఎలా యాడ్ చేసిందని ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఉన్న హౌస్ మేట్స్ లో ముందు నుండి గౌతమ్ ఏకాకి లా సోలో గేమ్ ఆడుతున్నాడని తాను పర్ఫెక్ట్ అని అంది. అలాగే అర్జున్ కూడా మధ్యలో కలగచేసుకుని తాను కూడా ఏకాకినే అన్నాడు. ఏది ఏమైనా అశ్విని అన్న మాటల్లో నిజం లేకపోలేదు. ఈ విషయంపైనే నాగార్జున వార్నింగ్ ఇస్తూ ఇకనుండైనా ఎవరికీ వారు తమ కోసం మాత్రమే ఆడమని చెప్పారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు