Biggboss season7: మరోసారి జోకర్ అయిపోయిన అశ్విని!

బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో అశ్విని శ్రీ ఒకరు. ఈ అమ్మాయి ఎంట్రీ ఇచ్చిన రెండో రోజే ఆడియన్స్ అశ్విని బిగ్ బాస్ కి సెట్ అవధాని తేల్చేసారు. ఎందుకంటే రెండో రోజు నామినేట్ చూస్తుంటేనే తనని ఒక్క గేమ్ కూడా ఆడకుండానే బయటికి పంపించేస్తారా అని ఏడుపు మొహం పెట్టేసింది. ఆ తర్వాత కూడా పెద్దగా గేమ్ లో యాక్టీవ్ గా లేదు. కానీ లాస్ట్ వీక్ లో మాత్రం ఆటల్లో 90% ఎఫర్ట్ పెట్టింది. నాగార్జున కూడా ఆ విషయంపై మెచ్చుకున్నారు.

అయితే అశ్విని నామినేషన్స్ టైములో మాత్రం ఏం మాట్లాడాలో తెలియక సరైన పాయింట్ చెప్పలేక ఇబ్బంది పడుతుంది. ఓపెన్ గా చెప్పాలంటే బిగ్ బాస్ లో అశ్విని ఒక జోకర్ అయిపోతుంది.

గత వారంలో అర్జున్ ని నామినేట్ చేసే టైం లో నిన్ను నామినేట్ చేస్తే, నన్నేమైనా చేస్తావేమో అంటూ నోరు జారింది. ఆ డైలాగ్ విన్న హౌస్ మేట్స్ అందరూ డబుల్ మీనింగ్ అనుకుని తెగ నవ్వేశారు.

- Advertisement -

తాజాగా యావర్ ని నామినేట్ చేస్తూ ఒక ఆడపిల్లని చేసి నన్ను ఇక్కడ ఆడుకుంటున్నావ్ అంటూ యావర్ పై నోరు జారింది. అక్కడితో ఆగకుండా నువ్వు నన్ను గెలికావ్, అందుకే నేను నిన్ను గెలికాను అంటూ అనేసింది. అశ్విని అన్నదాంట్లో పెద్దగా తప్పు లేకపోయినా దాన్ని ఆడియన్స్ వేరే విధంగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు